కరుకు బెరుకు లేని కోయిలమ్మ
రాజకీయ సాహితీ రంగాల్లో చురుకు
తెలుగింటి కోడలువెలుగులు నింపింది
జిలుగులతో కవితలల్లింది
ఆమె నవ్వులో కలకలలాడే సరోజాలు,
ఆమె మాటలు గలగల పారే సెల ఏళ్లు
రాజకీయాలు సాహిత్యంని ఆపోసనపట్టిన
పన్నెండవ ఏటనే మెట్రిక్ పాసై
పదమూడవ ఏట పదమూడు వందల కవిత అల్లిన నవ మల్లిక
సాంఘిక సాంస్కృతిక సాహిత్య త్రివేణీ విరిబోణి
పెద్ద బొట్టు పట్టుచీర,నవ్వులపువ్వుల ఆనంద తరంగిణి
భారతీయ మహిళల అభ్యుదయంకై పోరాడి
గెలిచిన అభ్యుదయ వాణి
అమ్మా! గాజుల గలగలలు,పల్లకీ బోయీల "
మొయ్యర అమ్మోరిని" అని గుండెలో గులాబులు
పూయించిన పూలరెమ్మ కివే జోహార్లు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి