కలవని....
భూమ్యాకాశాలను...
గ గ న, సాగరాలను....
పరికించి చూస్తున్నావా !
ఎంత కలుపుకు పోవా లనుకున్నా...
కలవ లేని నీ బ్రతుకుతో బేరీజు వేసుకుంటున్నావా
నువ్వు నీ బ్రతుకుతో...
కలవ లేక పోయినా...
నువ్వు నీ బంధా లన్నిటి తోనూ....
కలిసున్నట్టే కనిపించాలి
నిజానికి నువ్వొ0టరిగానే వచ్చావ్...!
నువ్వేంటి ఈ లోకంలోకి అందరమూ ఒంటరిగానే వచ్చాము...!!
వస్తూనే ఏర్పడ్డ బంధాలు కొన్ని...!
మనం కావాలని ఏర్పరచు కొన్న
బంధాలు మరికొన్ని...!!
అన్ని బంధాలూ ఒక టొకటిగా వీడి పోవలసిందేగా....!
నే డు0డి రేపు పోయే బంధాల కోసం....
ఎందు కంత వేదన...!?
బంధా లెప్పుడూ....
అవసరం ఉన్నంత వరకే
తీరి పోతె....వీ డి పో తై!
తెలుసు కోలేనంత వరకే ఈ భ్రా0తి...అశా0తి...!
సత్యం తెలిస్తే.... అంతా ఆనందమే ... శా0తియే!!
జీ వితం పడవ ప్రయానం
సమాజమొక నదీ ప్రవా హం...!
ఆ ప్రవాహం లో మునిగి పోక....
ప్రయాణిస్తున్నంత వరకే ఆనందము...! నువ్వు బంధాలతోనే నీ జీ వనం కొన సాగించాలి...,
గాని, ఆ బంధాలకు నీవు బంధీవి కారాదు....!
అలాగని నీ బంధాలతో ఎప్పుడు...
వైరమూ తగదు....!
నింగి - నేల ...
జలధి - గగనము....
అవే నీకు గురువులు!
ఈ సమాజంతో నువ్వు
కలిసి పోయినట్టే కనిపించాలి...
గా నీ...., ఎప్పుడూ
నీవు ఒంటరి గానే వచ్చాను....,
ఒంటరి గానే పోతాను అని గుర్తుంచుకో...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి