అమ్మ అనే పిలుపులోనా
తెలుగు మొదటి అక్షరం
అమ్మ ఆడించే ఆటలోనా
రెండో అక్షరం ఉంది చూడు
ఇంటిలోన జ్యోతులు
ఈశ్వరుడు మెచ్చును
ఉట్టి మీద పెరుగు గురిగి
ఊరిలోన పచ్చని చెట్లు
ఋషులందరూ వచ్చారు
ౠపాలను మార్చారు
ఎలుక చూసి వచ్చి
ఏనుగు మీద ఎక్కి
ఐలయ్యను పిలిచింది
ఒంటరిగా వచ్చాడు
ఓడ మీద ఎక్కాడు
ఔషధాలు తెచ్చాడు
అందరికీ పంచాడు
ఆః ఆః అంటూ నవ్వాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి