పిల్లలందరు వచ్చారు
చిన్న పుల్లలు తెచ్చారు
సన్నగా వారు చీరారు
పక్కకు వాటిని పెట్టారు
యోచన వారు చేశారు
తెల్ల కాగితం తెచ్చారు
చిన్న బొమ్మను గీశారు
గమ్ము ఒక్కటి తీశారు
బొమ్మకు పైన రుద్దారు
చీరిన పుల్లలు అతికారు
చక్కగా చిత్రము చేశారు
దాన్ని నీడలో పెట్టారు
రకరకాల బొమ్మలు చేసి
రొక్కానికి వారు అమ్మారు
ఎంతో పొదుపు చేశారు
జ్ఞానాన్ని వారు పొందారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి