సామెత -140 : అప్పు తీరినంక అంగట్ల సంసారం జేసినా ఫర్వాలేదు
****
"ఏంది తమ్మీ! మస్తు కుషాలుగున్నవ్? లాట్రీ ఏమన్న తలిగిందా ఏంది? గింతకు ముందు బూబారమంత నీ నెత్తిల్నే మోత్తున్నట్టు ఉసూరుమనేటోడివి. ఏదేమైనా నిన్ను గిట్ల సూత్తుంటే నాకు సుత మస్తు సంబురంగ ఉంది తమ్మీ!"
"అవ్వా! అయ్యిందానె! నీ మాటల దండకం నన్ను మెచ్చుకున్నదీ తెల్వట్లే. సన్నశిన్నగ సురకలేసిందీ తెల్వట్లే. సరే తీ! గిప్పుడైతే నువ్వన్నట్టే కుషాలుగైతే ఉన్న. నెత్తిమీద బారం కంటె గుండెల మీద బర్వు దింపుకున్ననే అవ్వా!"
"గదేంది తమ్మీ! గట్లంటవు? ఇంతకు మునుపు నిన్ను సూశినప్పుడల్ల గీ తమ్మి కట్టాలు ఎప్పుడు తీర్తయో. ఏ శీకూ శింత లేకుండ ఎప్పుడు నలుగురి లెక్క ఉంటడో అని రంది పడేదాన్ని.గియ్యాల నిన్ను కండ్ల నిండుగా సూడబుద్ధి అయితాంది."
"గందుకే గదవ్వా! గీ సంబురాన్ని నీతో శెప్పుకునేందుకు వొచ్చింది.
"అమ్మకి పానం మంచిగుండేది కాదయ్యె. దవాఖాన్లకు, మందులకు బోలెడంత ఖర్సాయె. నాయిన తాగి తాగి ఒంటి మీదికి తెచ్చుకునే.ఒక్కడి రెక్కల కట్టం మీద గీళ్ళ ఖర్సులు ఎల్లక ఉన్న పొలమూ అమ్మిన్నా. గాళ్ళని బతికిచ్చుకోవాలె అని దొర్కిన కాడల్ల అప్పు దెచ్చిన్నా! పతోడు ఎక్కడ అప్పు అడుగుతనో నని తప్పుకోని పోతుంటే ఇజ్జత్ పోయినట్టు అన్పిచ్చేది.
"అవును తమ్మీ!ఆళ్ళీల్లు నిన్ను అన్న మాటలు నేను సుత యిని బాదపడిన".
గా బగవంతునికి నా బాదలు కట్టాలు సుతి ముట్టినయేమో? నాయిన్ని గా తాగుడు ఎసనం మాన్పించే దవాఖాన్ల శెరీక చేత్తే మంచిగై వొచ్చిండు. మా యామె శెవి దుద్దులు అమ్మి గిక్కడే రచ్చబండ పక్కన గుమ్శీ ( బడ్డీ కొట్టు) పెట్టించిన. అవో ఇవో అమ్ముకుంటుంటే ఇల్లెల్లుతోంది.
"మరి అప్పులోల్లు లొల్లి శేయట్లేరా తమ్మీ!"
"ఎందుకు శేయట్లేరవ్వా గాళ్ళ కాళ్ళా ఏళ్ళా పడి కాసింత సయిమమం ఇయ్యమని ఏడుకున్న. పేట రోడ్ పక్కన ఎప్పుడో మా శిన్నప్పుడు నాయిన గొన్న తలముంది.గదానికి గిప్పుడు మత్తు రేటు పల్కింది.మా యామె గదాన్ని అమ్మొద్దన్నది గని అప్పు తీర్సుడు ముక్కెం అన్కొని అమ్మిన. "అల్లికి అల్లి సున్నకి సున్న తీర్గ" మొటామొటిగా శేతిల పైస మిలగకున్నా అప్పులైతే తీర్నయవ్వా!"
శానా శానా సంతోషం తమ్మీ! అప్పులు తీర్శినవ్.అమ్మెట్లుంది? ఒంట్లె బాగయ్యిందా?"
అమ్మ గిప్పుడు నయమే అవ్వా! మన ఇంటి ముందు,ఇంటెనక ఉన్న తలంల కూరగాయలు,ఆక్కూరలు పండిచ్చి అమ్ముతున్న. గావీటి మీద వొచ్చిన పైసలు అమ్మ మందులకైతున్నయి.
"మొత్తానికి అప్పులన్నీ తీర్నయవ్వా! నా జలమల గీ అప్పులు తీర్తయా? ఏం రంది లేకుండా బత్కుతనా అనుకున్న. గా తలం అమ్మిన డబ్బులు సరిపోకపోతే ఇల్లుసుత అమ్ముదామని బేరం బెట్టిన.
"నిజమే తమ్మీ!అప్పు తప్పు ఎప్పుడు శేయగూడదు. అశెలే తమ్మీ? "అప్పు తీరినంక అంగట్ల సంసారం జెసినా ఫర్వాలేదులే తమ్మీ! గీ మాటలే మన పెద్దోళ్ళు సుత అన్భవంతో చెప్పిండ్రు.
"గస్మంటి మంచి మాటలు ఇనాలే. పొదుపుగ జెయ్యాలె. ఇషారం జెయ్యాలే గని ఏదో ఒక ఉపాయం తప్పకుండా మన్సుకు తడ్తది తమ్మీ!
"ఇంగో సమ్మక్క సారలమ్మ బంగారం.నోరు తీయగ శేస్కో " అని అవ్వ తెచ్చిత్తే కండ్లకద్దుకుని సంబురంగ నోట్లేసుకుండు తమ్ముడు.
గదండీ సంగతి!అప్పు తీసుకున్నంక తీర్సాలి."అప్పు తీరినంక అంగట్ల సంసారం జేసినా ఫర్వాలేదు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి