సుప్రభాత కవిత : -బృంద
మోడై నిలిచిన మనసుకు 
మోహనమై మోదము పంచే 
ఉదయం

వెలితిలో మునిగి 
శిధిలమవుతున్న మదిని
చేయూత నిచ్చి నిలబెట్టే
ఉదయం

వెంటాడే మమతలతో 
వేటాడే తలపులకు 
ఊరట నిచ్చే 
ఉదయం

శూన్యంలో  తారాడుతూ 
దైన్యం నిండిన ఎడదకు 
చిరు ఆశ కలిగించే 
ఉదయం

చేరువైన చెలిమి 
చెప్పకుండా దూరమై 
చెమ్మగిల్లిన కన్నుల 
నవ్వు నింపే
ఉదయం

కళ తప్పిన కలలతో 
కలవరపడే కనులకు 
కనువిందు కలగ చేసే 
ఉదయం

అగాధమంటి జీవనజలధిలో 
ఆణిముత్యమంటి 
అనుభూతి  అందచేసే 
ఉదయం

గుండె పొరలో  మండే 
మంటను చల్లార్చి 
మనసు శాంతితో నింపే 
ఉదయానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు