జాతీయ గీతాలు ఆయా దేశాల గొప్పతనాన్ని విశిష్టతను చాటి చెప్తాయి. ఈ గీతాన్ని బృందంగా పాడుతున్నప్పుడు కలిగే ఆనందానుభూతే వేరు. పాడే ప్రతిసారీ ఓ ఉత్తేజం. ప్రతి జాతీయగీతమూ పవిత్రమైనది. ఇంకా చెప్పాలంటే ఓ దివ్యమంత్రంలాంటిది. దేశ స్వాతంత్ర్యానికి, ఐక్యతకూ సంస్కృతికీ అద్దం పడతాయి. అయితే ప్రతి జాతీయగీతం వెనుకా ఏదో ఒక ముఖ్యాంశం ఉంటుంది.
మెక్సికో జాతీయ గీతం స్వరకర్త జాతీయ గీతం సాహిత్యంతో వచ్చే వరకు అతని స్నేహితురాలు ఒక గదిలో బంధించింది .
** మెక్సికో జాతీయ గీతం రచన పోటీని నిర్వహించినప్పుడు, కవి ఫ్రాన్సిక్సో గొంజాలెజ్ బోకనెగ్రా Francicso González Bocanegraని అతని స్నేహితురాలు పోటీలో పాల్గొనమని కోరింది. అయితే అందుకతను నిరాకరించాడు. దాంతో ఆమె అతనిని మెక్సికో చరిత్ర చిత్రాలతో కూడిన గదిలో బంధించి తాళం వేసేసింది. గీతాన్ని రాసిన తర్వాత మాత్రమే బయటకు రావాలని షరతు విధించింది. ఆ స్థితిలో అతను రాసిన గీతం జాతీయగీతమైంది. అత్యంత దేశభక్తి, ఆత్మవిశ్వాసం, దూరదృష్టి గల ఆ స్నేహితురాలికి అతను ధన్యవాదాలు తెలిపాడు.
** క్వీన్స్ ఆహ్వానంపై సుల్తాన్ ఓమారు లండన్ సందర్శించారు. అయితే సుల్తాన్ని స్వాగతించే వేడుకలో మలేషియా గీతం వినిపించేందుకు అతని సహాయకుడిని అడిగారు. కానీ తమకంటూ ప్రత్యేకించి జాతీయ గీతం లేనందుకు సిగ్గుపడినప్పుడు పుట్టినదే ఓ పాట. అదే మలేసియా జాతీయగీతమైంది.
** 1918లో చెకోస్లోవేకియా ఏర్పడినప్పుడు, చెక్ ఒపెరానూ, స్లోవాక్ జానపద పాటనూ కలిపి ఓ గీతం రూపొందించారు. అది జాతీయగీతంగా ఉండేది. కానీ చెకోస్లోవేకియా దేశం రెండుగా విడిపోయినప్పుడు, ఈ గీతం కూడా రెండు భాగాలైంది. గీతంలోని మొదటి భాగం చెక్ రిపబ్లిక్ కి, రెండవది స్లోవేకియాకు చెందిన జాతీయగీతాలుగా మారాయి.
** కేవలం ఎనిమిది పంక్తుల సంగీతంతో కూడిన ఉగాండా జాతీయ గీతం ప్రపంచంలోనే అతి చిన్న గీతమై రికార్డు పుటలకెక్కింది. ఆలాపన నిడివి పొడిగించడంకోసం అప్పుడప్పుడు వరుసగా రెండుసార్లు పాడుతారు.
** దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు, కోస్టారికా జాతీయ గీతం స్వరకర్త కెప్టెన్ మాన్యుయెల్ మారియా గుటిరెజ్‌ను 1853లో జైలుకు పంపారు. ఎందుకంటే ఆయన కోస్టారికా జాతీయ గీతాన్ని స్వరపరచడానికి నిరాకరించడంత!
** గ్రీస్ దేశపు జాతీయగీతం అతి దీర్ఘమైనదిగా నమోదైంది. ఈ పాటను
కవి డియోనిసియోస్ సోలోమోస్ ఇమాజిన్
Dionysios SolomosImagine రాశారు.
రచించారు. ఇది 158 చరణాలతో కూడినది. కానీ కొన్నిసార్లు కొద్దివరకే పాడతారు.
** జపాన్ జాతీయ గీతం, 'కిమీ గా యో', హీయాన్ కాలంలో (794-1185) ఒక అనామక రచయితచే వ్రాయబడింది.
సాహిత్యం వాకా పద్యం ఆధారంగా రూపొందించబడింది. అయితే తొమ్మిదవ శతాబ్దంలో మీజీ కాలంలో దీనిని రాగయుక్తంగా స్వరపరిచారు. ఇది చాలా పురాతన గీతమైనదిగా నమోదైంది.
** ఐక్యత, పని, పురోగతి అనే నినాదంతో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ నేషనల్ జాతీయగీతం రూపొందింది.
** ఇది మొదట సైనిక కవాతు ట్యూన్ తో స్వరపరుస్తూ కేవలం వాయిద్యాలతో సాగుతుంది. 1970 నుండి, స్పెయిన్‌లో పదాలనేవి లేకుండా ఒట్టి రాగంతో జాతీయ గీతం సాగి దేశ కీర్తికి అద్దంపడుతుంది.
** నిజమే, ఇంకా చనిపోలేదు, అది ఎప్పటికీ ఉండకూడదని మేము కోరుకుంటున్నాము.
"సూర్యకాంతిలో మంచు చచ్చుబడినట్లు మన శత్రువులు చనిపోతారు, సోదరులారా, మేము మా భూమిలో సంతోషంగా జీవిస్తాము" అని అర్థంతో ఉక్రైన్ దేశపు జాతీయగీతం కొనసాగుతుంది.
** సైప్రస్ విషయానికి వస్తే, ఈ దేశానికి సొంతంగా జాతీయ గీతం లేదు.
అయితే, గ్రీస్, టర్కీ జాతీయ గీతాలను అరువు తీసుకుని వాటిని కలిపి జాతీయగీతంగా ఆలపిస్తుంది సైప్రస్. కానీ ఇది సరికాదని కొందరి వాదన.
** సెయింట్ హెలెనా దేశపు జాతీయ గీతం, 'మై సెయింట్ హెలెనా ఐలాండ్' ని
డేవిడ్ మిచెల్ అనే అమెరికన్ రాశాడు. విచిత్రమేమిటంటే అతనెప్పుడూ సెయింట్ హెలెనాకు వెళ్ళలేదు. అతను ఈ ద్వీపానికి సంబంధించి కొన్ని పోస్ట్‌కార్డ్‌లను చూడటం ద్వారా ప్రేరణ పొంది ఈ గీతాన్ని రాశాడు.
** నెదర్లాండ్స్ జాతీయగీతంలో పదిహేను చరణాలుంటాయి. స్పెయిన్‌పై డచ్ తిరుగుబాటులో విప్లవ వీరుడు విల్లెం వాన్ నాసోవ్ గుర్తుగా ఈ గీతం రూపొందింది. ప్రతి చరణంలోని మొదటి అక్షరాలన్నింటిని కలిపితే అతని పేరు వస్తుంది.
** జాంబియా, టాంజానియా, దక్షిణాఫ్రికా జాతీయ గీతాలు 1897లో ఎనోచ్ సోంటోంగా రాసిన న్కోసి సికెలెల్’ ఆఫ్రికా అనే భావంతో కూడినవే.
** ఎస్టోనియా, ఫిన్లాండ్ జాతీయ గీతాలు సంగీతపరంగా ఒకేలా ఉంటాయి కానీ విభిన్నమైన సాహిత్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే లీచ్టెన్‌స్టెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ జాతీయగీతాలు ఒకే శ్రావ్యతను కలిగి ఉంటాయి కానీ విభిన్నమైన సాహిత్యాన్ని కలిగి ఉంటాయి.
** మీ మరణిస్తున్న శత్రువులు మీ విజయాన్ని, మా కీర్తిని చూస్తారు!" అనే భావంతో ఫ్రాన్స్ జాతీయ గీతం సాగుతుంది.
** 1905లో బెంగాల్ విభజనను నిరసిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అమర్ షోనార్ బంగ్లా' గీతాన్నే 1971లో బంగ్లాదేశ్ తమ జాతీయ గీతంగా స్వీకరించింది. అలాగే శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఠాగూర్ రాశారని కొందరంటే మరికొందరు ఠాగూర్ రచనల నుండి ప్రేరణ పొంది ఆ దేశస్తుడు జాతీయగీతాన్ని రాసారంటారు. అదలా ఉండనిస్తే మన భారతదేశ జాతీయగీతం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరుదేనని అందరికీ తెలిసిన విషయమే.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి