ఓ నారీ: - కవి మిత్ర, సాహిత్య రత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-విశాఖ పట్నం

 ప్రసవవేదన పడినా
పండంటి పసిపాపకు జన్మనిచ్చి
పరవశించి మురిసిపోయే మాతృమూర్తిగా
కష్ట సుఖాలలో కలిమిలేములలో
పిల్లల పెంపముకంలో
అవాంతరాలు ఎదురైనా
ఓర్పుతో భరించి
వెను
దిరిగి అడుగువేయని సహనశీలి.
అనురాగ ఆప్యాయతలను పంచే అనురాగదేవత.
.
అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొని
ఆడది అబల కాదు సబల అని
ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమలకు ప్రతీకగా
శాస్త్ర సాంకేతిక రంగాలలోనేగాక
దేశాన్ని పరిపాలించే  ప్రజాప్రతినిధిగా
పురుషులతో సమానంగా
అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీకగా నిలిచే
ఓ నారీ నీవు మా పాలిట పరాశక్తివి
మా మనుగడకాధారమైన 
నీకు శతకోటి వందనములు...!!
........................

కామెంట్‌లు