సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -135: అలకాపురికి రాజైనా అధికంగా ఖర్చు చేయగూడదు
***
"అవ్వా! గా కొండయ్య దొర కత ఇన్నవా? మన శిన్నతనాన ఓ ఎల్గు ఎలిగె గద! ఇంటి నిండా నౌకర్లు శాకర్లు.ఎప్పుడు జూశినా  వొచ్చే పొయ్యే సుట్టాలు పక్కాలతో గా దొర ఇల్లు ఓ సత్రం లెక్క ఉండేది. వొండేటోళ్ళు వొండేవాళ్ళు. పెట్టేటోళ్ళు,తినేటోళ్ళు ,తీసేటోళ్ళు పొద్దత్తమానం గా యిల్లు గడియ సుత ఇరాం దీసుకునేది గాదు గదవ్వా!"
 "అవును శెల్లె! గా కొండయ్య దొర ఇలాకా ఎవలికి దెల్వదు జెప్పు. గిప్పటి జమానాకి దెల్వదేమో మనందరికీ తెలుసు. గాయనకి గంత ఉన్న సుత తొవ్వెంటబోతూ పతొక్కల్ని ఆపాచ్ఛనగ పల్కరిచ్చేటోడు.పేదోడు కన్బడితే కీసలోంచి ఎంతొత్తె అంత తీసి ఇచ్చేటోడు.
"అవునవ్వా!  గంత రాచ భోగాన్ని  అనుభగిచ్చిన  గా దొర గిప్పుడు మొత్తంగా లాచారైండు."
"అవునా శెల్లె! గాల్ల గురించి  శిన్నప్పుడు జేజవ్వ ఎప్పుడు జెప్పేది గాల్లు కోట్లకి పడగలెత్తిండ్రని. సాచ్చాత్తు కుబేరులే అని."
"అవునా అవ్వా! గంతున్నోడు గిట్లెట్లయిండు? సూత్తుంటే మస్తు బాదయితున్నది."
"శెల్లే! ఒక్క మాట శెప్తున్న ఇనుకో" అలకాపురికి రాజైనా అధికంగా ఖర్సు శేయగూడదు. ఒల్లు సోయి మర్సి  శేత్తె ఇగ్గో గా కొండయ్య దొరొతికె అన్నీ పోగొట్టుకునే పరిత్తితి వొత్తది."
అల్కాపురి ఎవలిదవ్వా? గా కతేంది?"
 "ఏడుకొండల ఎంకన్న సామి పెండ్లికి అప్పిచ్చిన కుబేరుని పట్నం శెల్లే. పుష్పక యిమానం సుత గాయనదే. బగ్గ సంపాదించిన వాళ్ళని కుబేరునితో పోలుత్తరు."
 "గట్ల కుబేరునంతటోడిది. గా కొండయ్య దొర స్తితి.గని శివరాకరికి ఏమైందో శూషినవు కదా! గాయన శేత తిన్నోళ్ళు. గాయన వల్ల లాభం పొందినోళ్ళు ఒక్కలు సుత ఏంది గిట్లయిందని పల్కరిచ్చి పోడానికి సుత రాలేదు. వొత్తె అప్పు సప్పు వాళ్ళ మీద పడ్తుందని బయం.
"గదండీ సంగతి!  అల్కాపురికి రాజైనా అధికంగా ఖర్చు చేయకూడదు "అంటే గిదే మరి.ఎనకా ముందు సూడకుండ కర్సు అస్సల్కి శెయ్యొద్దు.

కామెంట్‌లు