మాతృత్వాన్ని మరిచేవెందుకు?: - కవిమిత్ర, సాహిత్యరత్న-\ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
అడజన్మ సార్థకత మాతృత్వంలోనే కదా
పరమేశ్వరుని కృపతో ఉన్నతంగా ఎదిగావే
నేటి సమాజాన పురుషునితో సమానంగా
చక్కటి కంప్యూటర్ సంస్థలో పనిచేస్తు
పండంటి ఇద్దరు పిల్లలను ఉన్నతంగా చదువించాలని
ఇంటర్ చదివిస్తు సరస్వతి, లక్ష్మీలకు ప్రతీకగా నిలుస్తు
భర్త విదేశాల్లో ఉన్న ధైర్యంగా 
ఆడది అబల కాదు సబల అన్నట్లు
పిల్లల బాధ్యతను నిర్వసిస్తు
వారికి అనురాగ ఆప్యాయతలను పంచుతు
సహనానికి, ఓర్పుకి నిదర్శనంగా
నిలబడే నీలో  హృదయ దౌర్బల్యం ఎలా వచ్చింది
మాతృత్వపు మధురిమలను మరచి
పరువానికి వచ్చిన  పిల్లలతో సహా
రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నావే
ఓ మాతృమూర్తి  నీలో మాతృత్వపు మమకారం ఏమైంది
ఒక్క క్షణం ఆలోచించావా
సమస్యల పరిష్కారం ఆత్మహత్యకాదన్నది
ఈ జగతిన సమస్యలు లేనిదెవరికి?
============================================

( ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో ఉన్నత కంప్యూటర్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విని ఆర్ద్రతతో వ్రాసినది)..
.............................

కామెంట్‌లు