* హిత బోధ *: -కోరాడ నరసింహా రావు
అన్నిటికీ ఆ సర్వేస్వరుడే దిక్కని నమ్ము మురా...! 
 సర్వేశ్వ... నీవే దిక్కని శ రణును వేడుమురా...!! 

శరణు వేడి ఇక పాపము లెన్నడు చేయబోకుమురా! 
  పశ్చాత్తాపమె పాపము నకు పరి హారము తెలియుము రా...!! 

పాపము పిడుగు- పుణ్య ముగొడుగు పెద్దల మాటిది రా...! 
   పెద్దల మాట చద్ది మూ ట ముమ్మాటికి నిజ మిది రా...!! 

చేసిన పాప, పుణ్యములే స్వర్గ నరకములు, అవి వే రెక్కడో లేవురా..! 
 మన కర్మలకు ఫల మిచ్చ టనే అనుభవించవలెరా!!

 మన సుఖ,దుఃఖములకు
మనము చేసిన కర్మలెకారణము...! 
 ఇతరులపైనిందలువే
యుట అజ్ఞానమె నమ్ము మురా...!! 

దుష్కర్మలతో దుఃఖ బాధలుతప్పవుతెలియుమురా...! 
 సత్కర్మలు జేసిన ఉత్తమ జన్మలు తప్పక వచ్చునురా...!! 

ఉత్తమ జన్మతొ ఆనందము నీ వనుభ వింతువు రా...! 
  దుఃఖమె నరకము , ఆ నందమే స్వర్గము సత్య మిదేను రా...!! 

అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే దిక్కని నమ్ముమురా...! 
  సర్వేశ్వరా... నీవే దిక్కని శరణును వేడుము రా...!! 
       *****

కామెంట్‌లు