కార్తీక పౌర్ణమి వెన్నెలలో
అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణలో
మనమిరువురం ముప్పై ఏండ్ల క్రిందట
ఒకరినొకరు కళ్ళతో చూసినది
కుటుంబ పరిచయకార్యక్రమాలు అయి
వారి అంగీకారంతో ఒకరికొకరు
అర్థనారీశ్వరతత్వానికి ప్రతీకగా
ప్రేమానురాగాలతో మమేకమై
మనసున మనసై బ్రతుకున బ్రతుకై జీవిస్తు
పవిత్ర ప్రేమకు చిహ్నంగా
నేను వృత్తి రీత్యా రెండు రోజులు ఉరికెళ్ళిన
నా కొరకై ప్రేమ తో అర్ధరాత్రి వరకు ఎదురుచూసి
నే వచ్చిన వేళ సంబరంగా హృదయానికి హత్తుకున్నది మధుర జ్ఞాపకమే
అర్ధాంతరంగా నను వదలి వెళ్ళినా
నీ జ్ఞాపకాలతో నిశీధిలో నాకొరకై
ఆనాడు నీవు ఎదురుచూసినట్లే
నేడు నీదరి చేరాలని
భగవంతుని వినమ్రతతో అంజలి ఘటిస్తు ప్రార్ధిస్తున్నా..!!
...............................
ప్రేమ నిశీధి: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-హైదారాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి