సామెత -136: అబద్ధమాడితే గోడకట్టినట్టుండాలె.
***
"అవ్వా! అవ్వా! నాకు జొరమొచ్చినట్టుందే. గట్ల అన్పిచ్చినప్పుడు బల్లెకు రావొద్దని మా సార్లు జెప్పిండ్రు. కదక్కా అనంగనే భూలచ్మికి ఏం జెప్పాల్నో తెల్వక అవును కాదు కాదు అన్నట్టు తల నిల్వుగ అడ్డంగ ఊపడం గమనిచ్చింది అవ్వ."
బుడ్డోడి మాటల్లో ఏదో తేడా గొట్టడం జూసి"గీని యవ్వారమేందో తెల్సుకోవాలె అన్కుంది.
అయ్యో! బుడ్డోడా! అయితే ముడుసుకుని పడుకో తిరక్కు.జొరం పెరుగుద్ది."
"భూలచ్మీ ! జప్పున బొయ్యి శేషయ్య తాత దుకణంల నాలుగు గుడ్లు పట్కరా పులుసు పెట్టుకుందాం.గట్లనే నీకిట్టమైన బొంగుండనో పల్లుండనో బట్కొచ్చుకో!"
అవ్వ మాటల్కి సంబురపడ్కుంట గట్లనే అవ్వా! మరి బుడ్డోడికొద్దా?"
"అమ్మో జొరమొచ్చినట్టుంటే గుడ్డు గాని పల్లుండ, బొంగుండ గానీ అస్సలు తినొద్దు.ఏద్దిన్నా జొరం ఇంకాత్త ఎక్వయితది".
"ఒరేయ్ బుడ్డోడా! యాది కొచ్చింది.ఇగ్గో రేపు నీకు బల్లె గుడ్డు ఇత్తరు దాన్ని తినబాకు. మంచిగున్నప్పుడు అక్క పిలేటిలో గుడ్డు దీస్కొని తింటవు గద.గిప్పుడు అక్కకి ఇయ్యి."
"అనంగనే బుడ్డోడి మనసు విలవిలలాడింది.నెమ్మదిగ పిల్లినడక నడ్సుకుంట అవ్వ తానకొచ్చి అవ్వ శేతిని నొసలుకి తాకిచ్చుకుండు.
అవ్వా! జొరం లేనట్టనిపిత్తుంది కదూ! గిప్పుడు పానం మంచిగుంది. ఇంగ నేను సుత గుడ్డు పులుసు, పల్లుండ ,బొంగుండ తినొచ్చవ్వా! జొరం బోయింది గద!"
బుడ్డోడి మాటల్కి ఫక్కున నవ్వింది అవ్వ.
"ఒరేయ్ బుడ్డోడా! నా తాన నాడ నీ నాట్కాలు."అబద్దమాడితే గోడ గట్టినట్టుండాలే!" ఉషారుగున్నోడివి జొరమొచ్చిందంటే ఎవల్రా నమ్మేది.గందుకే నీ అంతట నువ్వే జెప్పాలని గిట్ల జేసిన.
" ఎన్కట నీ అస్మంటోడే! అబద్ధాలు ఆడొద్దు అని మందికి జెప్పుకుంటనే ఓ దినం గాళ్ళింటికి ఏదో పనిమీద వొచ్చినోళ్ళ ముందు కొడుకుతో ఒరేయ్ "ఏన్నీళ్ళ బిందెల ఏడు కొరమీన్లు ఆడుతున్నయి గని ఓ పాలి సూశిరా" అన్నడంట.
గా మాటలు యిని గాయనింటికొచ్చినోళ్ళు "అబద్దాలడితే అతికినట్టుండాల్రా బై. ఎక్కడన్న శేపలు ఏన్నీళ్ళల్ల ఏత్తే బత్కుతయా! నీ ఎచ్చులు పాడుగాను" అని నాలుగు దులిపి బోయిండ్రంట. గట్లుంది ఇయ్యాల నీ యవ్వారం.
"ఇయ్యాల ఇంట్లె అప్పలు సకినాలు జేత్తున్నమని పసిగట్టి బల్లెకు బోకుండ జొరమొచ్చిందని జెప్పినవ్.జొరమొత్తె అప్పలు ఎవలన్న తింటరా! నిన్ను తిననిత్తమా శెప్పురా? అనంగనే ఇంగెప్పుడు అబద్ధాలు ఆడనవ్వా తప్పయింది."
అంటుంటే అవ్వ నవ్వుకుంట బుడ్డోడిని దగ్గర్కి తీస్కొని వొక్క దినం బడికి బోకపోతే బల్లె సార్లు పంతులమ్మలు జెప్పే పాఠాలు ఇనకుండ, ఆటలు ఆడకుండ అయితవు గద! ఎప్పుడూ గది యాదిల బెట్కోవాలె."
గా మాటలు యిని బుడ్డోడు చెకా చెకా వొయ్యిల సంచి సద్దుకొని బడిబాట బట్టిండు.
గదండీ సంగతి! "అబద్దమాడితే గోడ గట్టినట్టుండాలే" గని గిట్ల గాదు. శిన్నోడు గద అందుకని అబద్దం పొతగలదు. కొంతమంది కండ్ల ముందు సైన్మా జూపిచ్చి,మనల్ని ఏడిపిచ్చి వొంద కోసం వొచ్చి మన జాలి గుండెలోల్లనుంచి వెయ్యి సుత బదులు అడుక్కొని బొయ్యేటోళ్ళు ఉంటరు. ఇంగ ఆళ్ళకి ఇచ్చామంటే వాటి మీద ఆశలు వొదులుకోవల్సిందే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి