ప్రభుత్వ బడిలో చేర్చండి - మన ఊరు బడిని కాపాడండి

  యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జడ్పీహెచ్ఎస్ నివగాం వేదికగా యూటీఎఫ్ కొత్తూరు ఆధ్వర్యంలో “మన ఊరి బడిని మనం రక్షించుకుందాం” అనే పోస్టర్‌ను గౌరవ ఎంఈఓ ఎన్. శ్రీనివాసరావు నివగాం ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ కె. వెంకటరావు, మాతల హైస్కూల్ హెడ్మాస్టర్ జి.సూర్యనారాయణ, చేతుల మీదుగా యూటీఎఫ్ కొత్తూరు సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్ అధ్యక్షులు కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమాజ అభివృద్ధికి పునాది వంటివని తెలిపారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ బడిలో చేర్పించడం ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. మన ఊరి బడి మన అందరి ఆస్తి అని, దాన్ని కాపాడుకోవడం ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన బోధన అందించే కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తాయని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం సాధ్యమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షులు కె.విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మధుసూదనరావు, సహాధ్యక్షులు తొగిరి రవి, అకాడమీ కన్వీనర్ శ్రీ బూరాడ గణేశ్వరరావు, సిపిఎస్ కన్వీనర్ బాలరాజు, ట్రెజరర్ శ్రీ భద్రయ్య, దినేష్,మార్కో, కృష్ణ, భరత్, తిరుపతి, నివగాం హైస్కూల్ సహోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు