తొలి పరిచయంభూమిని ముద్దాడే తొలిసంతకంఅప్పుడే ఉదయించిరెండాకులు తొంగి చూచిరవికిరణాల స్పర్శతో నవ్వుతూఅలరారే పచ్చని జాతిఎదిగి పరోపకారంలో మునిగిన నైజం!!అమ్మ కడుపునుండి వెలువడ్డ బిడ్డపుడమిపై వెలసిన తొలిపరిచయంతెరవని కళ్ళుమెరిసిన ఒళ్ళుమురిసిన తల్లిముద్దాడిన క్షణంమాధుర్య రసానందం!!చూపులతో కలిసిన తొలి పరిచయంమాటమాట జతగూడిన వైనంప్రేమికుల గమనానికి చిహ్నంమరుపురాని అనుభూతుల ధాన్యంఅదే జీవితానికి పరమార్థంతొలిపరిచయం ఎప్పుడు మధురమేఅయ్యావు తొలిపరిచయంపెట్టావు మదిలో గిలిగిలిచేశావు తొలి సంతకంమాయని మమతల గీతంమార్చేశావు జీవన పథంనేర్పావు బ్రతుకు పాఠంఉండాలి మరి జీవితాంతంభవిష్యత్ కారాదు ప్రశ్నార్థకం!!---------------------------
మురిసే తీపి జ్ఞాపకం: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-M.A,M. Phil., Ph.d-విశ్రాంత సహయాచార్యులు-హైదరాబాద్-9490367383
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి