అనగనగా ఒక గ్రామం ఉండేది . ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రాజేష్, మరొకరి పేరు అరవింద్ . వారు ఇద్దరు రోజు బడికి వెళ్ళేవారు. రాజేష్ చాలా బాగా చదివేవాడు . కానీ అరవింద్ అస్సలు చదివేవాడు కాదు ,రాజేష్ రోజు చదువుపై శ్రద్ధ చూపేవాడు. అరవింద్ చదువుపై శ్రద్ధ చూపేవాడు కాదు. చూస్తూ చూస్తూనే పదవ తరగతి వచ్చేసింది . పదవ తరగతి తర్వాత ఇద్దరు విడిపోయారు. రాజేష్ విదేశాలలో తన చదువును కొనసాగించాడు. అరవింద్ తన చదువును ఆపివేసి చెడుపనులకు అలవాటు పడ్డాడు. 10 సంవత్సరాల తర్వాత రామాపురం గ్రామంలోకి పది కార్లు వచ్చాయి. ఆ గ్రామీయులందరు ఆశ్చర్యపోయారు. వారందరూ ఎవరు వీళ్ళు మా గ్రామానికి ఎందుకు వచ్చారు. అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే కార్లో నుంచి రాజేష్ వచ్చాడు. రాజేష్ ను చూసి ఆ గ్రామీయులందరు అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజేష్ అంటాడు నేను మన జిల్లాలో IAS ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడు గ్రామీయులందరు ప్రోత్సహిస్తారు. తరువాత వాళ్లందరు వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. రాజేష్ అరవింద్ ను కలవడానికి వెళ్తాడు. అరవింద్ ఎలా ఉన్నావు అని అడిగాడు. " నేను మంచిగానే ఉన్నాను అని సమాధానమిచ్చా డు ,ముందుగా IAS అయినందుకు శుభాకాంక్షలు చెప్తాడు. అరవింద్ కొద్ది సేపు సమయం గడిపి వెళ్ళిపోతాడు, తరువాత అరవింద్ వాళ్ళ అమ్మ వచ్చి నీ స్నేహితుడు IAS అతను తన చదువును కొనసాగించి IAS అయ్యాడు. నువ్వు నీ విద్యను ఆపేసి మాతోపాటు పని చేస్తున్నావు. విద్య చాలా విలువైంది అది మన జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ఆ అవకాశాన్ని కోల్పోయావు. అని చెప్పి వెళ్ళిపోయింది.Network తన తప్పు తెలుసుకొని చాలా బాధపడతాడు.
చదువు విలువ: - N. తరుణ్,(s/o)బద్దు-8వ తరగతి (బి),-TGTWURJC (B) ఇబ్రహీం పట్నం -రంగారెడ్డి- జిల్లా
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి