ప్రేమించాలి - శా0తిని నెల కొల్పాలి.....! : - కోరాడ నరసింహా రావు!
ఇచ్చి పుచ్చుకునే ప్రేమను 
 చేజారి పో నీకు...! 

ఇవ్వటం లో ను...పుచ్చు కోవటం లోనూ ...   
అభిమానం,ఆప్యాయత..
శ్ర ద్ద, ఆసక్తులు ఉంటే... 
  ప్రేమ ఎందుకు చే జారి పోతుంది...!? 

నీ ప్రేమలో... స్వచ్చత, నిస్వార్ధత ఉంటే.... 
 నువ్వా ప్రేమను యిచ్చి నా, పుచ్చుకున్నా.... 
 అది పదిలం గానే ఉంటు0ది...!! 

ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లెక్కడున్నాయ్ ?! 
  ఒక్క తల్లి ప్రేమలో తప్ప! 

అన్నీ... ఆకర్షణలు, వ్యా మోహాలు, అవసరాలు తప్పితే...!! 

నిజ ప్రేమ ఎక్కడ ఉంటుందో... 
  అక్కడ త్యాగం ఉంటుంది...! 
    సేవ ఉంటుంది...!! 

ఈ జగమే ప్రేమమయం! 
 ప్రేమకు స్వార్ధం తెలియదు...!! 

ప్రేమించాలి... ఈ ప్రకృతి ని ప్రేమించాలి... 
 ముందు నిన్ను నువ్వు ప్రేమించటం నేర్చు కోవాలి
  సాటి మనిషిని ప్రేమించ గలగాలి... 
  సకల ప్ర పంచాన్నీ ప్రేమించాలి...! 
  నువ్వు నీ వలె నీ పొరుగు వారినీ ప్రేమించ గలిగితే.... 
  రెండు ప్రపంచ యుద్దాలు జరిగి ఉండేవా...?! 

ఇప్పుడు  ఇలా... మూడో ప్రపంచ యుద్దం వైపు పరుగులు తీసేవారిమా?!? 
 
అందుకే... 
  ఈ ప్రపంచాన్ని ప్రేమించా లి...!
  సాటి మనిషిని ప్రేమించా లి...!! 
      ప్రేమను పంచాలి...! 
శా0తిని నెల కొల్పాలి...!! 
     *****

కామెంట్‌లు