ఇంజనీరు రత్నలక్ష్మికి మహిళా కీర్తి రత్న - 2026 ఎక్స్లెన్స్ అవార్డు

 కడప జిల్లా జమ్మలమడుగులోని గాలేరు నగరి సుజల స్రవంతి డివిజన్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్న  శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి తెలుగు సాహిత్యంలో విశేష ప్రతిభా పాటవాలు కనబరుస్తూ, తన రచనలతో ఎన్నో బహుమతులు, అవార్డులు, రివార్డులు, బిరుదులు పొంది తన విశిష్ట సేవలతో తెలుగు భాషాభివృద్ధికి దోహదపడుతూ అమూల్యమైన కవిత్వ రచనలతో సాహిత్య రంగానికి చేస్తున్న ఎనలేని సేవలను గుర్తించి 03/03/2026న విజయవాడ బెంజ్ సర్కిల్లోని సర్వోత్తమ గ్రంథాలయంలో సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా మరియు శ్రీ శ్రీ కళావేదిక సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎస్. రత్నలక్ష్మికి మహిళా కీర్తిరత్న - 2026 ఉమెన్స్ ఎక్స్లెన్స్ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులైన శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం  రత్నలక్ష్మిని అభినందిస్తూ పూలమాలతో కంఠసీమను అలరించి దుశ్శాలువ అందమైన జ్ఞాపికతో బాటుగా మకుటధారణ గావించి మహిళ కీర్తిరత్న - 2026 అవార్డును ప్రధానం చేస్తూ ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు