ఇంజనీర్ రత్నలక్ష్మికి నారీ కీర్తి పురస్కారం - 2026 అవార్డు ప్రదానం

కడప జిల్లా జమ్మలమడుగులోని గాలేరు నగరి సుజల స్రవంతి డివిజన్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్న  శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి తెలుగు సాహిత్యంలో విశేష ప్రతిభా పాటవాలు కనబరుస్తూ, తన రచనలతో ఎన్నో బహుమతులు, అవార్డులు, రివార్డులు, బిరుదులు పొంది తన విశిష్ట సేవలతో తెలుగు భాషాభివృద్ధికి దోహదపడుతూ అమూల్యమైన కవిత్వ రచనలతో సాహిత్య రంగానికి చేస్తున్న ఎనలేని సేవలను గుర్తించి 04/03/2026న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో విశ్వ సాహితి కళావేదిక వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎస్. రత్నలక్ష్మికి నారీ కీర్తి పురస్కారం - 2026 అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ చైర్ పర్సన్ శ్రీమతి పివిపి అంజనీకుమారి విశ్వసాహితి కళావేదిక అధ్యక్షురాలు కొల్లి రమావతి ప్రధాన ఆర్గనైజర్ వినయ్ కుమార్ రత్నలక్ష్మిని అభినందిస్తూ దుశ్శాలువ అందమైన జ్ఞాపికతో బాటుగా నారీ కీర్తి పురస్కారం - 2026 అవార్డును ప్రధానం చేస్తూ ఘనంగా సన్మానించి సత్కరించారు. 
కామెంట్‌లు