హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సి. ఎం.: వెంకట్ , మొలక ప్రతినిధి
 హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు.
వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8నుంచి 14  వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు