సముద్రగుప్తుడు 32 అచ్యుతుని రాజ్యశ్రీ

 కుస్థలపుర్ రాజుని అణచాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు సముద్ర గుప్తుడు.ఆరాజుకి మంచి గజబలం ఉంది."చంద్ర గుప్తా!ఇదే మన అంతిమ యుద్ధం!" చంద్రగుప్తుడు తవ్వించిన గోతుల్లో ఆఏనుగులన్నీ ధడాలున పడ్డాయి.లోపలున్న ఇనుపబాణాలకి అవి భీకరంగా ఘీంకారం చేశాయి.విజయం దక్కింది.కానీ సముద్ర గుప్తునికి అశ్వంకి శత్రువుల బాణాలుతో ఒళ్లంతా తూట్లు చిల్లులు పడటం,మహారాజు స్పృహ తప్పటం జరిగింది.చంద్ర గుప్తుడికి తండ్రిని ఆస్థితిలో చూడగానే మతిపోయింది.రాజధానికి తిరిగెళ్లి సుశ్రుతునివైద్యానికి తండ్రిని అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. రామగుప్తునికి లేఖరాశాడు"యువరాజుగా నీవుండి రాజ్యపాలన చేయి" అని.ఇంకేముంది? స్వార్ధపరుడైన రామగుప్తుడు పెత్తనం పేనుకి స్తే తలంతా గొరిగిందనే సామెతను సార్ధకం చేసింది.శిఖరస్వామిని సేనాపతి,ప్రధానామాత్యునిగా నియమించాడు.పాటలీపుత్రంలో వేశ్యాలయాలు మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.హరిషేణుడు చేసేదేంలేక పాటలీపుత్రాన్ని విడిచి వారణాసి వెళ్లిపోయాడు.దారిపొడుగునా తండ్రికి అవసరమైన చికిత్సలు  ఆటవికులతో చేయిస్తున్నాడు చంద్రగుప్తుడు.ఎలాగో పాటలీపుత్రం చేరిన అతను రామగుప్తుని కల్సి"అన్నా! తండ్రిగారికి సుశ్రుతునిపంపి వైద్యం అందించమని  విజయోత్సవం చేయకుండా నాణాల్ని విడుదల చేయాలని నిర్ణయించాడు. శ్రీదత్తుడు స్నానంచేయిస్తున్నప్పుడు,మహారాజు సముద్రగుప్తుని శరీరంపై 40పైగా గాయాలున్నట్లుగమనించాడు. అదితెల్సుకున్న చంద్రగుప్తుడు ఖిన్నుడైనాడు. మృత్యువాత బడినతండ్రిని చూసి విలపించాడు. అయోధ్య కెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉండి రాతిస్థంభంపై హరిషేణుని సంస్కృత రచనను చెక్కించాడు. కౌశాంబిలో(అలహాబాద్ కి 40కి.మీ) ఆస్థంభం పై ఇలా రాసుంది"మొదటి చంద్ర గుప్తుడు తన కొడుకు సముద్రగుప్తుని ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. "నాయనా!,నీవు ఆర్యావర్తాన్ని కాపాడు." తండ్రిని మించిన తనయుడుగా సముద్ర గుప్తుడు అచ్యుతనంది,నాగసేన,గణపతినాగ్ లను ఒకేసారి ఓడించాడు.అతని అందమైన శరీరంపై పరశువు,బాణం,బల్లెం, కత్తి మొదలైనవి చిత్రింపబడ్డాయి. జయించిన రాజులను సహృదయంతో విడిచిపెట్టేవాడు. ఆర్యావర్తరాజులనుంచి వార్షిక ధనం, బహుమతులు తీసుకునేవాడు.శక సింహళరాకుమార్తెలు అతని భార్యలైనారు. సహస్రాధికంగా గోదానాలు చేశాడు.బుద్ధికి బృహస్పతి,కవిరాజు,సంగీతంలో నారదతుంబురులతో భేటీ!"ఈస్తంభంపై రాత మహారాజాధిరాజు సముద్రగుప్తుడు,మహారాణీ కుమారీదేవి,లిచ్ఛవీ రాకుమారి పుత్రుడైన  మహారాజు చంద్ర గుప్తుడు అంటే ఘటోత్కచుని మనవడు, శ్రీగుప్తుని మునిమనవడు రాయించాడు.ఇది హరిషేణునిచే రాయబడిన  విశేషాలు🌹
సమాప్తం..
కామెంట్‌లు