గణిత శాస్త్రం అంకెల్తోమొదలవుతుంది. మన అధర్వణవేదంలో సున్న మూలాలున్నాయి.క్రీ.పూ.200లో200లో పింగళాచార్యుడు కనిపెట్టాడు. పింగళఛందస్సులో సున్నాని గూర్చిఉంది.1000బి.సి.లో మయుడు సూర్య సిద్ధాంతంరాశాడు.ఇన్ఫినిటీ నిగూర్చి పూర్ణమదః పూర్ణమిదం శాంతిమంత్రంలో ఉంది.పరమాత్ముడు అనంతుడు.అనంతంలోంచి అనంతాన్ని తీసేస్తే మిగిలేది అనంతమే!
శుల్బసూత్రాలు యాగశాలలు,హోమగుండాల కొలతలు తెల్పుతుంది.ఆల్జీబ్రా అంటే బీజగణితం ని అవ్యక్త గణితం అని అంటారు.క్రీ.పూ.800లో శుల్బసూత్రాల్లో వివరింపబడింది.బీజగణితంలో ఒకశాఖ కుట్టకగణితం. దేవరాజనే పండితుడు కుట్టకశిఖామణి అనే గ్రంథం రాశాడు.పూరీ శంకరాచార్యుల పరంపరకుచెందిన శ్రీభారతీకృష్ణతీర్థ ఆవిష్కరించిన వేదిక్ మాథమాటిక్స్ ని నేడు స్పీడ్ మాథమాటిక్స్, శీఘ్రగణితం అని అంటారు.
భూగోళం,సూర్య గోళం, చంద్ర గోళం అని వేదాల్లో ఉంది.సూర్యుడు తండ్రి( ఆంబోతు) భూమితల్లి(గోవు) చంద్రుడు( దూడ) అని మంత్రాల్లో ఉంది.ఆంబోతు చుట్టు ఆవు, ఆవు చుట్టు దూడ తిరుగుతున్నట్లుగా సూర్యునిచుట్టూ భూమి,దానిచుట్టూ చంద్రుడు తిరగటం నేటి జాగ్రఫీ లో చదువుతున్నాం. ఈవిషయం వేదాల్లో ఉన్నా 16వశతాబ్దంలో గెలీలియో చెప్పాడని మనం నేర్చుకోటం మన అజ్ఞానం
ఇక వేదభాష్యాన్ని రాసిన వారు విద్యారణ్యస్వామి, ఉపవర్షాచార్యులు ఆదిశంకరులు ముఖ్యులు.భాగవతవ్యాఖ్యాత శ్రీధరాచార్యుడు,భారత వ్యాఖ్యాత నీలకంఠాచార్యుడు,పంచకావ్యవ్యాఖ్యాత మల్లినాధసూరి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి