వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
55.సుమేరు శృంగమధ్యస్థా (అష్టాక్షరీ)
56.శ్రీమన్నగర నాయికా (అష్టాక్షరీ)
యాభై ఆరవ నామ మంత్రము -
ఓం శ్రీమన్నగర నాయికాయై నమః
శ్రీవిద్యానగరమై, శుభములను ఇచ్చునట్టిదై, సకలైశ్వర్యములను తనలోనే కలిగివున్న "శ్రీచక్రమే" , "శ్రీమన్నగరము" గా భాసిల్లుతున్నది. ఆ శ్రీమన్నగరానికి "మహారాజ్నిగా", "అధిష్టాత్రి" గా ఉన్న, జగదైక జనని "శ్రీమాత" కు నమస్కారము.
ఇంతకు ముందు నామములో పరమేశ్వరి ని, "సుమేరు శృంగమధ్యస్థా" అని కీర్తించుకున్నాము. ఈ నామము చదువుకునేటప్పుడు మనం, అమ్మవారు కొలువుండే మేరు పర్వత శిఖరము లోని మధ్య పర్వతము, బంగారు వర్ణములో ఉంటుంది అని, దీని చుట్టూ త్రికోణ ఆకారములో వున్న మూడు శిఖరములు త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆనవాళ్ళని, ఈ మూడు శిఖరాలను ఇచ్ఛా శక్తి, జ్ఞానాన శక్తి, క్రియా శక్తులుగా కూడా చెప్పుకున్నాము. ఈమూడు శిఖరముల మధ్యలో వున్న 400 వందల యోజనాల ఎత్తుకలిగిన నాల్గవ శిఖరమే జగజ్జనని నివాస స్థానము, అని కూడా చెప్పుకున్నాము. పరాత్పరి నివాస స్థానము అయి, బంగారు ఛాయను కలిగి, నర దృష్టి కి కనపడని ఈ శ్రీమన్నగరములో సకల దేవతలు, కిన్నెర కింపురుషులు, ఋషులు, యోగులు ఉంటారు.
పరమేశ్వరి యొక్క మరియొక నగరము, అన్ని బ్రహ్మాండములకు ఆవల లేక వెలుపల, సుధాసాగరము ఉంది. ఆ సుధాసాగరము మధ్యలో "రత్న ద్వీపము" ఉంది. ఈ "రత్న ద్వీపమే" పరమేశ్వరి యొక్క రెండవ నగరము, "మణి ద్వీపము". అనేకానేక బ్రహ్మాండములను దాటి పైన కోటి యోజనముల విస్తారము గల రత్న ద్వీపమే "జగద్వీపము" గా కూడా చెప్పబడుతోంది. ఈ ద్విపములో ప్రతీ గోడా మూడు యోజనముల ఎత్తు కలిగి ఉంటుంది. ప్రతీ గోడ కూడా 25 తత్వస్వరూపములతో అలరారుతూ కన్నలవిందు చేస్తుంటుంది. "శ్రీ" అంటే లక్ష్మి, సంపద, సౌభాగ్యము, అలంకరణ, వృద్ధి, త్రివర్గము ఇలా వివిధ అర్థాలు ఉన్నాయి. ఈ అర్థములన్నీ కూడా పరమేశ్వరి నివాస స్థానము నకు సరిపోయేవే కదా! ఇటువంటి రత్న ద్వీపంలో ఉన్న పరమేశ్వరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "శ్రీమన్నగర నాయికా" అని కీర్తించారు.
అమ్మ నివాస స్థానము అయిన "మణి ద్వీపము" అనబడే రత్న ద్వీపము యొక్క వర్ణను శ్రద్ధగా చదివి, సాధన చేయడం అంటే, అమ్మ అనుగ్రహం తో మోక్ష ప్రాప్తి పొందడమే. అంతటి ఉత్కృష్టమైన మణి ద్వీప వర్ణన వేరొక సందర్భంగా చేసుకుందాము.
"శ్రీ" అంటే త్రివర్గము అని కూడా అర్థం వుంది. త్రివర్గము అంటే ధర్మ, అర్థ, కామములు. ఈ మూడు గుణములు ఎక్కడ అయితే క్రమ పద్ధతిలో నిర్వహించబడయతాయో ఆ ప్రదేశమే పరమేశ్వరి ఉండే "మణి ద్వీపము". సత్వ రజో తమో గుణములు మూడూ పమేశ్వరుని నుండి వచ్చినవే. అయినా కూడా, పరమేశ్వరుని ప్రభావితం చేయలేవు. అలా తన నుండి వచ్చిన గుణాలతో ప్రబావింప పడకుండా ఉన్నాడు కనుకనే, "గుణరహితుడు" గా పిలువ బడ్డాడు. సత్వ రజో తమో గుణాలకు అతీతమైనది"మణి ద్వీపము".
ఈ మణి ద్వీపము లో, పరమేశ్వరునితో కూడి, అర్థనారీశ్వరియై తన భక్తుల, సకల అభీష్టాలను నెరవేరుస్తున్న లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం శ్రీమన్నగర నాయికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి