వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
56.శ్రీమన్నగర నాయికా (అష్టాక్షరీ)
57.చింతామణి గృహాంతస్థా (అష్టాక్షరీ)
యాభై ఏడవ నామ మంత్రము -
ఓం చింతామణి గృహాంతస్థాయై నమః
"చింతామణి" అనే ఒక జాతి రత్నము, ఎన్నెన్నో కోరికలను తీరుస్తుంది. అటువంటి అనేక ఉత్తమమైన చింతామణులతో నిర్మింపబడిన ఇంటిలో ఉంటున్న "శ్రీమన్నగరనాయకి" అయిన పరమేశ్వరి కి నమస్కారము.
ప్రతీ సాధకునిలో కూడా అతని సహస్రారం లో "చింతామణి గృహం" ఉంటుంది. తన సాధనతో సాధకుడు మూలాధారం నుండి సహస్రారం చేరుకుంటే, అమ్మ నివసించే "చింతామణి గృహం" చేరినట్టే. అప్పుడు, ఆ సాధకునికి "ముముక్షత్వం" దొరికి "బ్రహ్మత్వాన్ని" పొందుతాడు. ఇలా సాధకులను ముముక్షువులను చేస్తూ దర్శనమిచ్చిన పరమేశ్వరిని చూచిన వశిన్యాది వాగ్దేవతలు, అమ్మను "చింతామణి గృహాంతస్థా" అని కీర్తించారు.
మేరు పర్వతం మీద, త్రికోణము మధ్య, 400 యోజనముల విస్తారము లో వున్న మణిద్వీపం మధ్యలో, నవరత్న ప్రాకారములకు మధ్యన వున్న "చింతామణి గృహం" అమ్మ నివాస స్థానం. ఈ చింతామణి గృహంలో శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మండపాలు అని కోటి సూర్య కాంతులతో వెలిగిపోతున్న నాలుగు మండపాలు ఉన్నాయి. వీటిలో మణులతో పేర్చబడిన అరుగులు ఉన్నాయి. చింతామణి గృహం, పరమేశ్వరి మూల స్థానం. ఇక్కడ మూల ప్రకృతి అయిన భువనేశ్వరి యొక్క శక్తి తత్వములు, సోపానములు/మెట్ల రూపములో ఉన్నాయి.
*సుమేరు శృంగ మధ్యలో, పద్మములతో ఏర్పడిన మహా అడవి మధ్యలో, చింతామణి గృహంలో ఉన్న శ్రీమహారాజ్ని అయిన శ్రీమాత, తనను కొలిచే సాధకులను తరింపజేస్తూ ఉంటుంది. ఇంతటి కరుణామూర్తి ని పూజించేటప్పుడు
ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి