వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
58.పంచబ్రహ్మాసన స్థితా (అష్టాక్షరీ)
59.మహాపద్మాటవీ సంస్థా (అష్టాక్షరీ)
యాభై తొమ్మిదవ నామ మంత్రము -
ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః
చాలా గొప్పదైన, ఎంతో మహిమాన్వితమైన, పద్మములతో కూడిన వనమునందు నివాసమున్న పరమేశ్వరికి నమస్కారము.
బ్రహ్మాండమునకు పైన, మూడు లక్షల యోజనముల విస్తీర్ణము గల అనేక పద్మములు ఉన్న వనములో దర్శనము ఇచ్చిన శ్రీచక్రరాజసింహేశ్వరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు, "మహాపద్మాటవీ సంస్థా" అని కీర్తించారు.
మణి ద్వీపము లో వున్న మహాపద్మ వనము యొక్క వర్ణన "లలితా స్తవరత్నము"లో వున్నది. ఒక మహాపద్మము - పది తాడి చెట్ల పొడవు వున్న ఆకులు, అయిదు తాడి చెట్ల పొడవు వున్న దట్టమైన కేసరములు కలిగి వుంటుంది. ఈ కేసరముల నుండి మకరంద ప్రవాహము అనంతంగా, నిరంతరంగా స్రవిస్తూ ప్రవహిస్తూ వుంటుంది. మహాపద్మము నుండి వస్తున్న మంచి గంధపు వాసనకు ఆకర్షించబడి అనేక తుమ్మెద గుంపులు నిరంతరం వస్తూ, అవి చేస్తున్న తాకిడికి పద్మములోని పసుపు పచ్చని పుప్పొడి ఆ వనమంతా వ్యాపించి, ఎరుపురంగు ను కూడా మించి, పింజరవర్ణముగా కనబడుతోంది. పింజరవర్ణము అంటే బంగారు వర్ణమును కూడా తలదన్నే వర్ణము. ఈ పింజరవర్ణము వనమంతా వ్యాపించి, పరమేశ్వరి వైభవమును తెలియజేస్తుంది. ఇటువంటి మహాపద్మముల వనంలో వుంటున్న జగజ్జనని "మహాపద్మాటవీ సంస్థా" అయింది.
ప్రతీ జీవి శరీరం, విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార, ఆజ్ఞాచక్ర, సహస్రార అనబడే ఏడు పద్మముల కలయికతో ఏర్పడినదే. అందువలన, ప్రతీ మానవుని శరీరం ఒక మహాపద్మాటవియే. మహాపద్మాటవిలో ఉండేది శ్రీలలితా పరాభట్టారిక అని పైన తెలుసుకున్నాము, కదా! అందువలన ప్రతీ మానవుని మనస్సు అనే మణిద్వీపం మధ్యలో మహాపద్మాటవిలో శ్రీమహారాజ్ని నివాసం ఉంది. అలా నివాసం ఉన్న పరమేశ్వరియే "మహాపద్మాటవీ సంస్థా".
ఇలా ప్రతీ మానవుని లో వున్న పరమేశ్వరి ని తెలుసుకునే ప్రయత్నం కేవలం పరమ భక్తాగ్రేసరులకు, యోగి పుంగవులకు మాత్రమే సాధ్యమైనది. ఈ స్థానాన్ని శైవులు శివస్థానమని, వైష్ణవులు పరమపురుష స్థానమని, దేవీ భక్తులు దేవీస్థానమని, ఇతరులు హరిహర స్థానమని చెప్పుకుంటారు. ఈ స్థానమును తెలుసుకోగలిగిన వారికి, జన్మరాహిత్యమే సిద్ధిస్తుంది.
ఇలా "మహాపద్మాటవీ సంస్థా" అయి ఉన్న అమ్మను పూజించేటప్పుడు
ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి