వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
61.సుధాసాగరమధ్యస్థా (అష్టాక్షరీ)
62.కామాక్షీ (త్ర్యక్షరీ)
అరవై రెండవ నామ మంత్రము -
ఓం కామాక్షై నమః
దయ, ఆర్ద్రత లను కలిపి ఒకేసారి అనుగ్రహించగల దృష్టితో తన భక్తుల కామనలను (కోరికలను) తీర్చే కన్నులు గల అమ్మను చూసి వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను "కామాక్షీ" అని కీర్తించారు. అటువంటి కామాక్షీ పరదేవతకు నమస్కారము.
"కామాక్షీ" - మిక్కిలి అందమైన, సొగసైన, సొంపైన కన్నులు కలది. తన పరమేశ్వరుని, తన చేరిక వలన లోకాలకు తండ్రి అయిన శంభుని ఉల్లాసానికి, "తనకు అంతటి అందమైన కనుదోయి లేదే" అని ఒకింత ఉక్రోషానికి గురిచేసే , శాంకరి. అమ్మ ఆవిర్భావ సమయంలో, అగ్నిహోత్రుని అంశతో చక్షువులు అమిరాయికదా, అమ్మకు.
స్త్రీల కన్నులను మీనములతో, చేపలతో, పోల్చడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అమ్మ కన్నులు కూడా మీనములతోనే పోల్చబడ్డాయి. సరోవరములో చేపలు, రెప్ప పాటు కాలం కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండవు. మొప్పలు టప టపా కొట్టుకుంటూ నీటిలో అటుఇటూ తిరుగుతూ ఉంటాయి. ఆడువారి కన్నులు కూడా అంతే. తమ కనురెప్పలు మాటిమాటికీ మూస్తూ తెరుస్తూ చిలిపిగా చూస్తూ ఉంటాయి. అమ్మవారి కన్నులు మీనములు, బాగానే ఉంది. కానీ, కోనేరు ఎక్కడా? సముద్రం ఎక్కడా అనుకుంటే, పరాత్పరి ముఖమనే సరస్సులో, ముఖ సౌందర్యం అనే నీటిలో, అమ్మవారి మీనాలవంటి కన్నులు అటూ ఇటూ తిరుగాడుతూ ఉన్నాయన్నమాట. అందుకనే కదా! పరమేశ్వరిని "వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా" అన్నారు, వశిన్యాది వాగ్దేవతలు.
*అమ్మవారి కుడికన్ను సూర్యుని తేజస్సు తో పగటి కాలాన్ని, ఎడమ కన్ను చంద్రుని చల్లదనం పంచుతూ రాత్రి సమయాన్ని, మధ్యలో కనుబొమల ప్రాంతంలో ఉన్న మూడవ కన్ను సంధ్యాకాలం ను సూచిస్తూ... చరాచర జగత్తు లోని జీవనాన్ని నడిపిస్తున్న శ్రీమాతను పూజించేటప్పుడు
ఓం కామాక్షై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి