శ్రీపరాభవ ఉగాది పండుగొచ్చిన కారణం
ద్వారానికెక్కింది మావిడాకులతోరణం
గడపముత్తైదువకు పసుపుకుంకాలతో అలంకరణం
బంగారుతల్లులల్లిన రంగవల్లులతో తెలుగింటి ప్రాంగణం
అభ్యంగన స్నానానంతరం
నూతన వస్త్రధారణం
తొలిదైవంగా పూజలందు పురాణ వారణం
సుముహూర్తాన ఇంటిల్లిపాది
నింబపుష్ప భక్షణం
ఉగాదిప్రత్యేకం రసాయన ప్రసాదం,గ్రహణం వితరణం
షడ్రసోపేత భోజనం
కర్పూరతాంబూల చర్వణం
సాయంవేళల శుభ పంచాంగశ్రవణం
స్థానిక ఆలయ ఆవరణం
శ్రీకళాంజలి తెలుపు శుభాకాంక్షలతో ఆహ్లాదభరిత
వాతావరణం🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి