వేదవిజ్ఞానం 8సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 ఋగ్వేదంలో వ్యవసాయ సంబంధపనిముట్ల ప్రస్తావన ఉంది.నాగలి,కాడి, కొడవలి,తూర్పార బట్టడం,గాదెలగూర్చిన వివరణ ఉంది.అధర్వవేదంలో నాగలి కర్రు,కొరడా,చెర్నాకోల ప్రస్తావన ఉంది.కౌటిల్యుని అర్ధశాస్త్రంలో సీతాధ్యక్షుడు అనేపదం ఉంది.సీతంటే నాగేటిచాలు.నేటి అగ్రికల్చరల్ పదాలు,గోడౌన్,మార్కెట్ యార్డు ,రైతు కూలీల వ్యవస్థ ఉన్నాయి.ఖైదీలు,బానిసలు కూలీలుగా ఉండేవారు.క్రీ.శ.8వశతాబ్దిలో శుక్ర నీతిలో అగ్ని చూర్ణాలు ప్రేలుడుపదార్ధాల గూర్చిన వర్ణన ఉంది.8వశతాబ్దిలోనే కలంకారీ వస్త్రాలు ఎగుమతి చేసిన ఘనత భారత్ దే!వరాహమిహిరుడు"బృహత్సంహిత"లో అత్తరు సెంట్ల తయారుచేసే విధానంగూర్చి రాశాడు.వేదపరిభాషలో రోగాలకు పాపాలు అని పేరు.
కామెంట్‌లు