మహిళలు ఎదిగితే సమాజం ఎదుగుతుంది: - '' కావ్యసుధ " -9247313488- హైదరాబాద్

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) మహిళల సామాజిక, ఆర్థిక,సాంస్కృతిక,రాజకీయ విజయాలను గుర్తించే ఒక ముఖ్యమైన దినం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మహిళా హక్కుల గురించి అవగాహన కల్పించడంసాధికారతను పెంచడం, మహిళలపై వివక్షను అంతం చేయడానికి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.
        1908లో న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు తమ హక్కులుతక్కువ పనిగంటలుమెరుగైన జీతం కోసం చేసిన పోరాటంఅలాగే ఓటు హక్కు సాధన కోసం జరిగిన ఉద్యమాల నుండి ఇది పుట్టుకొచ్చింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా అన్ని రంగాలలో సమాన అవకాశాలుహక్కులు మరియు గౌరవం దక్కాలని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఇది మహిళల జీవితాలను మెరుగుపరచడానికి వేగవంతమైన పురోగతికి పిలుపునిస్తుంది ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి సమాన అవకాశాలను అందించడానికి వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను ప్రభుత్వాలను సంస్థలను ప్రేరేపిస్తుంది సామాజిక ఆర్థిక రాజకీయ విజయాలను గుర్తించడం గురించి అలాగే మహిళల హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. కనుక ఈరోజు ప్రపంచంలోని మహిళలకు అత్యంత ముఖ్యమైనది అందువల్ల మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
       అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్యసమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు మెరుగైన జీవితం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని  సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరములో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా,డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు.
        సమ సమాజ స్థాపనలో మహిళల పాత్ర ఎనలేనిదని వారి హక్కులను గౌరవించడం అందరి బాధ్యతని ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది. మహిళల ఆరోగ్య భద్రత మరియు న్యాయమైన సమాజం కోసం అవసరమైన మార్పులను విధానాలను చర్చించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ దినం ఒక వేదిక. మహిళలు తాము విద్య ఉద్యోగం రాజకీయాలు క్రీడలలో ఎంచుకున్న రంగాలలో సాధించిన విజయాలను వేడుక చేసుకోవడం మరియు వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ దినోత్సవం.
        అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం గా పిలిచేవారు వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం గుర్తింపు ఇస్తోంది ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనాల ఉత్సవంగా ఉంటుంది సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాల్లో ముఖ్యంగా తూర్పు ఐరోపా,రష్యా,సోవియట్ దేశాల సంస్కృతులలో భాగమయ్యింది. ఐక్యరాజా సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు.
          ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్హాగెన్ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.
         1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనను జరిగిన అవేవీ మార్చి 8న జరగలేదు అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవం గా ప్రకటించుకున్నారు ఆరోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చును కానీ అప్పటినుండే అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవం గా తీర్మానించారు. 1917 సోవియట్ విప్లవం తర్వాత రష్యా కూడా దీనిని ప్రకటించింది.1922 నుంచి చైనా వారు 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. ఆప్రాచ్య దేశాలలో  1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యతసంతరించుకుంది. సుమారు 100కు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.2011 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి.
    ఒకప్పుడు నాలుగోడలకే పరిమితమైన మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు తాను ఎంచుకున్న రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
( స్త్రీమూర్తులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )
   " ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
               " సాహితీ శిరోమణి "
                   '' కావ్యసుధ "  -9247313488-  హైదరాబాద్

కామెంట్‌లు