హోలీ... వసంత కేళి...: - -తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా-రత్న లహరి ఛానల్ సీఈవో-\9297109223
వసంతకాలం వచ్చింది
హోలీ పండుగ తెచ్చింది
రంగురంగుల పూలతో
ప్రకృతి నవ్వుతూ నిలిచింది
(జయ్ బోలో సృష్టి కీ, లాఈ రే హోలీ)

హిరణ్యుని చెడు నడతలు
ప్రహ్లాదుని భక్తి గుణాలు
హోళిక అగ్నిలో దహనాలు
విష్ణుభక్తుని విజయ గాథలు
(జయ్ బోలో విష్ణు కీ, మనావో రే హోలీ)

రాధాకృష్ణుల ప్రేమలా
రంగులమయమైన  లోకంలా
దైవిక భావాల  మాధుర్యంలా
మేఘశ్యాముని చరితంలా
(జయ్ బోలో కృష్ణ కీ, ఖేలో రే హోలీ)

శివుని తపస్సు భంగము
మన్మథ లీలల దహనము
రతీదేవి చేసిన విన్నపము
కాముని పునర్జన్మ ఘట్టము
(జయ్ బోలో రుద్ర కీ, జష్న్ రే హోలీ)

కోపతాపాలు వీడదాము
కలసి మెలసి ఆడదాము
రంగుల పండుగ చేద్దాము
ఐక్యత సందేశం చాటుదాము 
(హోలీ రే హోలీ, సబ్ కా పర్వ్ హోలీ
రంగోంకీ హోలీ, రాగోంకీ హోలీ)



కామెంట్‌లు