అంతర్జాతీయ మహిళా దినోత్సవం8 th march 2026===============================గాయాల్ని గుండెల్లో దాచుకునిగర్వంగా నవ్వడం నేర్చుకున్నాను!పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను!నిశ్శబ్దంగా కనిపించినానిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను!నేను మహిళను మాత్రమే కాదుమార్పుకు మొదటి అడుగు నేను!నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులుఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి!నన్ను ఆపాలని వచ్చిన చీకట్లుఇప్పుడు నా వెలుగుకే దారి చూపించాయి!కన్నీరు పొంగిన ప్రతి క్షణంనా గుండెల్లో విప్లవం మేల్కొంటుంది!నన్ను ఆపాలని వచ్చిన ప్రతి మాటఇప్పుడు నా విజయ గీతంగా మారుతోంది!నేను వంటింటి పొగ కాదునిరాశలో ఉన్న మహిళా హృదయాలకు ఆశ నింపివెలుగుజ్యోతిని వెలిగించాను!నన్ను అబల అని అన్న వారందరికీసహనాన్ని ఆయుధంగా మార్చుకొనినాయకురాలిగా దారులు చూపించాను!ఇల్లు నుంచి దేశం వరకుప్రతి రంగంలో వెలుగునిచ్చేప్రతి మగువకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ...అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-------------------------------------------------------------------మంజుల పత్తిపాటి (కవయిత్రి).- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
మంజుల అనే నేను: - మంజుల పత్తిపాటి (కవయిత్రి).- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి