వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ,పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ,గడపల గర్భగృహమున మంగళ స్వరమైతెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె.మామిడి తొరణాల పచ్చని తంతువులలోఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా,వేప పుష్పాల చేదు గర్భిత గంధములోజీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె.కోకిల కూయు కంఠమున కలకల రాగములుప్రకృతి మంగళ ధ్వనులై పరిమళించగా,వసంత సమీర మృదుస్పర్శ సన్నిధిలోనూతన సంవత్సర స్వప్నాలు సుస్వాగతించె.మామిడి–వేపల మేళన రసమూర్తిగాఉగాది పచ్చడి రూపమై వెలిసిన వేళ,చేడు–తీపి–పులుపు–కారం–ఉప్పుల రుచులలోజీవిత చక్రం సత్యమై ప్రతిధ్వనించె.సంస్కృతి సుమములు వికసించు వేళ,సంప్రదాయ దీపములు ప్రకాశించు వేళ,ప్రకృతి–మనుజ బంధమది పావనమైభూమి ఒడిలో నిత్యమై నిలిచియుండె.అందుకే ప్రతి ఉగాది ప్రబోధమై,పచ్చని మామిడి పుటల పలుకులలో,వేప పుష్ప సుగంధ విరిసిన వేళ,కోకిల గానామృత తరంగములలో,ప్రకృతి సాక్షిగా మన జీవన గాథకుకొత్త ఆది – కొత్త ఆశ – కొత్త మార్గమై నిలిచె.ప్రకృతితో కలిసి జీవిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, కొత్త ఆశలతో ముందుకు సాగాలి అని కోరుకుంటూమీకు మీ కుటుంబ సభ్యులకు పకృతి మెచ్చిన ఉగాది పండుగ శుభాకాంక్షలు.------------------------------------------------- మంజుల పత్తిపాటి - చరవాణి 9347042218.మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
ఉగాది – వసంత విభావరి”: - మంజుల పత్తిపాటి - చరవాణి 9347042218.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి