అణచివేత !ఆత్మవిశ్వాస చేయూత!: - డా.పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.
1.
ఆది/ఆధునిక కాలం,
సగటు మనిషి బతుకు శోషణం! 

మనిషి నైజం సాటి ,
మనిషి స్వేచ్ఛ హరణం! 

మనిషి మనిషిని బంధించి, ఉంచడమే మహారణం! 

సంతలో పశువుల్లా మనుషుల్ని, కొనడమే ఉదాహరణం! 

బానిసలను చేసి గొలుసులతో, బంధించడం ఎంత దారుణం?
2.
ఓ మనిషిని బాహ్యంగా,
బంధించే గొలుసులు !

వాడి సంకల్పం ముందు,
 తెగిపోయే దారం పోగులు!

అనాదిగా స్వేచ్ఛే ,
మనిషికి ప్రాథమిక ఇచ్ఛ!

అణచివేతలోనేగా,
 అంకురించు స్వాతంత్ర దీక్ష!

బానిసత్వ విమోచన,
 పోరాటాల అదే శ్రీరామరక్ష!
3.
మానవ వికాస సజీవ ,
          సాక్ష్యాలు విప్లవాలు! 

మనిషి స్వేచ్ఛా ప్రియత్వ,
              ఆరని జ్వాలలు!

నియంతల జీవితాల ,
           మరణ శాసనాలు! 

బంతి నేలకేసి కొడితే ,
     మరింత పైకి లేస్తుంది! 

ఇంతి శరీరాన్ని బంధిస్తే ,
   ఇంతింతై ఎదుగుతుంది!
4.
మనిషిని బంధనాలు, 
       వెనక్కి లాగుతాయి!

చర్యకు సమానమైన,
                ప్రతిచర్యల్లా! 

వేసే అడుగులు,
     ముందుకే పోతాయి! 

హింసకు గురి చేస్తే,
 అహింస ప్రదర్శిస్తాయి !

సత్యాగ్రహంతో ,
అన్వేషణ కొనసాగిస్తాయి!
5.
బంధాలేవి, ప్రతిబంధకాలు ,
కానే కావు! 

దౌర్భాల్యం అధిగమిస్తే ,
అవే పురోగమన సాధనాలు!

ధిక్కరించిన అన్నమయ్య ని , బంధించాయి గొలుసులు!

నారసింహ మంత్రంతో ,
పురికొసల్లా తెగిపడినాయి!

నరుడు సింహమైతే బంధించే, గొలుసులు ఇల లేనే లేవు!
=========================

కామెంట్‌లు