1.
విమానాశ్రయమా?
మా వంశీకుల ఆశ్రయం!
గేటెడ్ కమ్యూనిటియా?
హృదయగేట్లు లేని ఆశ్రమం!
కోట్ల ప్లాట్లు ఉన్నాయా?
పెంకుటిళ్ళు అందాల పొదరిళ్ళు!
హైవేలు ఎన్ని ఉన్నాయి?
బతికే "వేలు" ఎన్నో ఉన్నాయి!
పబ్బులు, క్లబ్బులు?
పల్లె రాత్రిళ్ళు నిద్రిస్తుంది!
2.
అక్కడ నీకు ఎవరు ఏమిస్తారు?
నన్ను అందరూ పలకరిస్తారు!
నీకున్నది ఏమిటి?
ఉన్నన్నాళ్ళు ఆదుకున్న పొలం?
నీ వారెవరు?
నాకక్కడ పగవారే లేరు!
ఆ ఊరెందుకు వదిలేసావు?
బతుకున పట్టణం ఆకర్షణ!
ఇప్పుడేమి చేస్తావు?
పల్లె అమ్మ ఒడి, ఆకుమడి!
3.
నేడు మా ఊరికి బస్సు!
దగ్గరలోనే రైల్వేస్టేషన్!
దగ్గరకు రాని పొల్యూషన్!
చదువు చెప్పే చక్కని బడి!
సేవా టిక్కెట్లు అమ్మని గుడి!
ఇలా పల్లె ఎదుగుతుంది,
ఎలా బతకాలో చెపుతోంది!
________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి