1.
ముదమార నేర్పిన ,
ముదిత నేర్వని విద్య గలదే!
కరవాలం చేపడితే,
కదన రంగాన ఝాన్సీ రాణి!
కవిత లల్లితే మొల్లగా,
రమణీయ కవితల రాణి!
ఉయ్యాల ఊపే చేతులతో ,
ఉర్వి శాసించే మహారాణి!
ఆధునిక మహిళ చరిత్ర, తిరగరాస్తుంది- ఇది జనవాణి!
2.
అమ్మగా జన్మనిస్తుంది,
ప్రధమ గురువై నడిపిస్తుంది!
సోదరిగా రాఖీ కట్టి ,
జీవితాంతం ఆపేక్షనిస్తుంది!
అలిగా తోడై వచ్చి ,
శ్రీమతిగా సిరులు నింపుతుంది!
ప్రియతనయగా పుట్టి , మెట్టినింట మణిదీపమౌతుంది!
మానవజాతి మనుగడకే ,
జగాన ప్రాణం మగువే పోస్తుంది!
3.
త్రేతా యుగాన సీత,
ధర్మమూర్తి సహధర్మచారిణి!
ద్వాపర యుగాన సత్యభామ, నరకాసుర సంహారిణి!
కలియుగాన అందరి,
మేలు కోరే మంగళకారిణి!
ఆర్యమాంబగా ఆదిశంకరుల్ని, కన్న మాతృరూపిణీ!
పుత్లీబాయిగా మహాత్ముని, కనిపెంచిన పుణ్యతరుణి!
4
శ్రీమతి ఇందిరా గాంధీ,
ఇలలో విశ్వవిఖ్యాత నేత!
కిరణ్ బేడీ లేడీ ఐ.పి.ఎస్. ,
దేశాన ప్రఖ్యాత వనిత!
అరుంధతి రాయ్ సాహిత్యాన, అంతర్జాతీయ ముదిత!
పి టి ఉష పరుగుల రాణి,
క్రీడా రంగాన విశ్వవిజేత!
శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, భారతీయ సంగీత సంహిత!
5.
భేటీ బచావో ,బేటి పఢావో,
దేశ ప్రగతి శీఘ్రగతి!
స్త్రీ గుణవతి, సౌందర్యవతి ,
ధీటైన చతురమతి!
అబల సబల ఘనసుత,
వనిత నేడు మన రాష్ట్రపతి!
ఆలయాన వెలసిన ఆ దేవుని, రీతి ఇల్లాలే జగతి జీవనజ్యోతి!
నారీ శక్తి నిజ జాగృతి,
జగతి భారతి యశోహారతి!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి