రంగులు కాకూడదు ఫిరంగులు: - -ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట -చరవాణి: 9490904976
శరీరానికి సంరక్షించే సహజ రంగులు..
దేహంపై దాడి చేసి, కాయానికి కష్టపెట్టే
కృత్రిమ రంగులు, ఫిరంగులు లాంటివి.

అందమైన రంగులు..
ఆకట్టుకునే రంగులు..
అందరూ ఇష్టపడే రంగులు..

పువ్వులు సహజసిద్ధ రంగులు.
ప్రకృతిలో ప్రతీదీ ఓ రంగుతో ప్రత్యేకమే..

వేసుకునే బట్టలకు రంగులు..
నెరిసిన జుట్టుకు రంగులు..
మెరుపు కోసం రంగులు..

అతివల అందం కోసం
వాడే సౌందర్య సాధనాలలో 
అంగడిలో దొరికే ఆహారపదార్థాలను
ఆకర్షణతో ఆకట్టుకుని,
అమ్ముకునేందుకు అన్నింట్లో
కలుపుతున్నారు కృత్రిమ, సింథటిక్ రంగులు.
  
అలర్జీ, అస్తమాలకు 
క్యాన్సర్, చర్మవ్యాధులకు
మరెన్నో వ్యాధులకు
ముఖ్య కారకాలు
కృత్రిమ రంగులు.

రంగుల కేళీ హోలీ..
ఆనందాల హేలీ..
పండగ వేళ పిల్లలు, పెద్దలు
ప్రతి ఒక్కరూ పాటించాలి
కొన్ని ముఖ్య జాగ్రత్తలు..
కంటిలో రంగులు పడకుండా
ధరించాలి కళ్ళజోడు,
శరీరం మొత్తం కప్పేలా
వేసుకోవాలి దుస్తులు.
లేకుంటే వ్యాధులకు వైద్యం చేపించేందుకు 
అమ్ముకోవాల్సివస్తుంది ఆస్తిపాస్తులు..
కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది పస్తులు 


కామెంట్‌లు