మార్చి ఎనిమిది 2026 మరచిపోలేని రోజు..:
క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించిన రోజు
భారత్ క్రికెట్ టీమ్ బంగారు ట్రోఫీ దేశానికి బహుమతిగా అందించిన రోజు..
ప్రగల్భాలు పలికిన
పాకిస్థాన్ కు పరువు తీసిన రోజు..
అసూయతో అమీర్ అర్థంపర్థం లేని మాటలకు నోరు మూయించిన రోజు..
పాక్ బౌలర్, పాక్ కు చెక్ పెట్టీ చెంప చెళ్లుమనిపించిన రోజు..
మార్చి ఎనిమిది మహిళా దినోత్సవమే కాదు..
మగాళ్ళ క్రికెట్ లో ముచ్చటగా మూడో సారి
టీ-ట్వంటీ ట్రోఫీ ముద్దాడిన రోజు..
ముగ్గురు మొనగాళ్ళు
న్యూజిలాండ్ ను నుజ్జు నుజ్జు చేసిన రోజు..
అభిషేక్ బ్యాటింగ్ ఫిఫ్టీ(52)తో షేక్ చేసి, బౌలర్లకు షాక్ చూపిస్తే
సంజూ పంజాతో తనదైన ముద్రగా హాఫ్ సెంచరీతో మరో భారీ ఇన్నింగ్స్ (89) ఆడి
ఇషాన్ కిషాన్ తుఫాన్ ఇన్నింగ్స్ అర్ధ శతకం(54)తో ఆటాడించేసి
దూబే దూకుడుగా(26) ఎనిమిది బంతుల్లో ఆడి దబ్బిడి దిబ్బిడే దెబ్బలతో దరువుతో దంచేశారు.
ఇరగదీసిన ఇండియా..
న్యూజిలాండ్ బ్యాట్స్మన్లను భయపెట్టి బెంబేలెత్తించి బాధ్యతగా బుమ్రా నాలుగు వికెట్లను తీసి నడ్డి విరిచేశాడు..
అక్షర్ అద్భుతంగా బౌల్ చేసి మూడు వికెట్లని మాటేసి గిరేస్తే..
హార్ధిక్, వరుణ్, అభిషేక్ చెరో వికెట్లను తీసి కివీస్ బ్యాటింగ్ను కుప్ప కూల్చేసి, రాల్చేసారు.
జట్టులోని ఆటగాళ్ళు అందరూ ఆద్యంతం సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించేశారు.
మూడో టీ-ట్వంటీ కప్పు మనదే..
సొంత దేశంలో కప్పును సొంతం చేసుకుని తొలి దేశంగా భారత్ నిలిచింది క్రికెట్ ప్రేమికుల, యావత్ ప్రజల మదిని గెలిచింది..
🇮🇳 🏆 🇮🇳
🇮🇳 జయహో భారత్ 🇮🇳

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి