మహిళా ఓ మహిళా
మహిలో " లా "మార్గం
చూపించి ఇల దీపించే
మణిరత్నం నీవే మహిళా !
ఈ విశ్వాన్ని నంద నందనం
చేసినట్టి మహిళకు వందనం
చేసేస్తే అందరం మనందరం
చూసేస్తే ఆమెగా వసుందరం !
మహిళ అంటేనే ఓ శక్తి ఆసక్తి
మనకు ఆందిస్తుంది ముక్తి రక్తి
ఆ మహిళ నాయకత్వం వహిస్తే
ఈ మహిలో సమానత్వం మస్తే !
ప్రేమ మూర్తులు ఆదర్శమూర్తులు
ఇలలోన మన వనితామూర్తులు
ఉన్నారు అన్ని రంగాల్లో ముందు
తిన్నారు విశ్వజనుల ప్రేమ విందు
తట్టి లేపుతుంది మన సమాజాన్ని
ఇట్టే చూపుతుందిక ఘన నిజాన్ని
ఇట్టి మహిళా మణులకు జేజేలు
కొట్టి మ్రోగిద్దాం ఇక మన బజాలు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి