పిల్లలం-బడి పిల్లలం !: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
మేం పిల్లలం బడి పిల్లలం
మా భరతమాత మల్లెలం
రోజు వెళతాం మా బడికి
జీవిత పాఠం నేర్పే గుడికి !

జాతీయ గీతం పఠిస్తం
వందేమాతరం జపిస్తం
ప్రతిజ్ఞ పాలన పాటిస్తం
త్రికరణ శుధ్ధికి చోటిస్తం 

ఆటలు అంటే మాకెంతో ప్రేమ!
ఆ ఆటలకై మేం పడతాం శ్రమ
పాటలంటే మాకెంతో  ప్రాణం
వినిపిస్తాం మేం గంధర్వ గానం

పాటలకు పల్లవియే ప్రాణం
ఆటలకు చెల్లదు నిస్త్రాణం
గురువు చెప్పిన ఈ మాట
మరువం మేము ఏ పూట !

ఆటపాటల ఆయువును పట్టి
తెలివితేటలతో మేం జతకట్టి
మైదానంలో ఆడుతాం నిత్యం
నిదానం పాటించుట సత్యం  !

పాటల పల్లకి  వెంటనే ఎక్కి
పాటల పల్లవికే ఉంటేనే చిక్కి
పాట స్ఫూర్తిని పెంచుకుంటం
 గెలుపు బాటను ఎంచుకుంటం !


కామెంట్‌లు