కోయిలమ్మ కూసేటి రాగాలతో
ఆ చెట్టమ్మ పూసేటి భోగాలతో
ఓ పరాభవ నామ సంవత్సరం
వచ్చి తెస్తివా ఉగాది పర్వదినం !
శ్రీశ్రీ పరాభవ నామ సంవత్సరం
శ్రీగ్రంగా తెచ్చే ఉగాది పర్వదినం
తెలుగు లోగిళ్లకు ఇదెంతో ఘనం
వెలుగు వాకిళ్లలో వెలిగే ఇంధనం!
వచ్చేను చనువిచ్చేను ఈ ఉగాది
సనాతన సాంప్రదాయాల పునాది
ప్రధానంగా ఉగాది నలుబైయవది
నిదానంగా చేస్తే సరిపోవు వ్యవధి!
వేకువనే వనితలందరు లేస్తారు
సోకుగా ముంగిట్లో ముగ్గులేస్తారు
కలసి మెలసి పండుగను చేస్తారు
ఆలసి సొలసి నిండుగా నిద్రిస్తారు
ఉగాది పచ్చడి షడ్రుచులష కలయిక
ఎగాదియై ఎవరూ లేరు తెలియక
పిల్లలు పెద్దలు అంతా రుచి చూస్తారు
ఎల్లరు గ్రోలి తృప్తితో సంతోషిస్తారు !
నచ్చి మెచ్చి ఉగాది కాంత వచ్చే
పచ్చని ప్రకృతి శోభను అందిచ్చే
అందిద్దాం ఆమెకు ఆహ్వాన పత్రం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి