నూతన పరాభవ సంవత్సరం
సనాతన సాంప్రదాయ పర్వదినం
ఈ దినమే వచ్చింది మన ఉగాది వేస్తుందిది తెలుగుదనం పునాది !
పచ్చని ప్రకృతిని తోడై తెస్తుంది
మెచ్చే సంస్కృతిని నీడై ఇస్తుంది
మన పరాభవ ఈకొత్త సంవత్సరం
మనచే చేయించేగా మహోత్సవం
కోయిలమ్మ పాడేటి పాటలతో
నెమిలమ్మ ఆడేటి ఆటలతో
వస్తుంది ఈ దినం మన ఉగాదిగా
మీరెందుకు చూస్తారిక ఎగాదిగా !
ఉత్సాహాన్ని ఊపిరిగా నింపుకోండి
బంధువులకు ఆహ్వానం పంపుకోండి
దండిగా సరుకులనిక దింపుకోండి
నిండుగా పండుగనిక చేసుకోండి !
షడ్రుచుల ఉగాది పచ్చడి తాగాలండి
పిల్లలు పెద్దలు అంతా కలిసి మీరండి
వినరండి మీరిక పంచాంగ శ్రవణం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి