ఓ శ్రీహరి రావయ్యా: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977.
హరి ఓం హరి ఓం ఓ మా శ్రీహరి
మీ పైనే మా భక్తుల అందరి గురి
మా భక్త బృందము సరుగున చేరి
అనురక్తితో తీసిరి నీపూజకు దారి

 పూలూ పండ్లను సమకూర్చారు
పసుపు కుంకుమ నీ దరిచేర్చారు
మంగళ హారతి నీకు ఇప్పించారు
మధురమైన నీ కథనే చెప్పించారు

 నీకై ఓ గుడిని వారు కట్టించారు
సోకైనా నీ ప్రతిమను పెట్టించారు
చమురు పోసి వత్తిని దట్టించారు
గుడిలో గండ దీపం ముట్టించారు

మా భక్తజనానికి వరాలను ఇస్తూ
వారి నుదుటి వ్రాతను మారుస్తూ
మోక్షానికి నీవు దారిని చూపిస్తూ
ఉన్నావు నీవు మమ్ముల ఒప్పిస్తూ

శ్రీ మహాలక్ష్మి నీకు ప్రియ సతి
మాకు మాత్రం నీవేగా ఇక గతి
నీ వచ్చి ఆదుకోవయ్యా శ్రీహరి
మమ్ము మెచ్చి వరం ఇయ్యి మరి

మా పూజకు నీవు మరి స్పందిస్తే
కోరిన వరం మాకు మీరు అందిస్తే
అవుతాం లే మేము ఇక ధన్యులం
కాలేం మేమెన్నడు నీకు అన్యులం

కామెంట్‌లు