నవ మాసములు తన గర్భంలో నను మోసి
నా యద ఫలకంపై ఓలమాలను తానిక వ్రాసి
అక్షరాస్యునిగా నను మార్చి ఆశీర్వచనంతో ఓదార్చే
మొదటి గురువు మా కన్నతల్లి ఆమెగా మా కల్పవల్లి !
మేం చదివేటి బహు పుస్తకాలను కొనిచ్చి
మా మస్తకాల జాగృతి పదును ను ఎంతో మెచ్చి
వెంటనే మమ్మిక మా చదువుల బడిలో చేర్పించిన
నాన్నే మాకు రెండవ గురువు ఆయనే మాకాదెరువు !
మా పాఠశాలలో ప్రతినిత్యం పాఠం చెప్పే మాస్టారు
మాకు చక్కగా బోధిస్తారు హుషారు కలిగిస్తారు
మాలో అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగించే
మస్తారే మా మూడవ గురువు అతనే మాకు ఆదెరువు !
మాలో తమస్సును తొలగించి ఉషస్సుని వెలిగించే
బ్రతుకు బాటలో చిరంజీవులై జీవించాలని భావించే
మా ప్రత్యక్ష దైవాలైన మా అమ్మ నాన్న గురువులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి