ప్రశ్న--జవాబు: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
ప్రకృతిలో గాలి ఉన్నది ఎందుకు తెలుసా ?
ప్రాణులు శ్వాసించేటందుకు ఓ మనసా .
ధరణి ఉన్నది ఇలలో ఎందుకు తెలుసా ?
ధాన్యం పండించే టందుకు మా మనసా !

నీలి మేఘం ఉన్నది ఎందుకు తెలుసా?
తేలి వర్షం కురిపించేటందుకు మనసా.
ఆమని ఇల ఉన్నది ఎందుకు మనసా?
అందాలను అందించేటందుకు మనసా. !

వెన్నెల ఇల ఉన్నది ఎందుకు తెలుసా?
కన్నుల విందు చేసేటందుకు మనసా.
వెలుతురు ఉన్నది ఎందుకు తెలుసా?
చీకటిని తుద ముట్టించేటందుకు మనసా.
ఊహలు ఉన్నవి ఎందుకు మనసా?
ఊసులాడేందుకు అవి మనసా.

యోగా ఉన్నది ఎందుకు తెలుసా ?
ధ్యానం చేసేటందుకు మనసా.
దీని అర్థం పరమార్థం తెలుసుకో రా కన్నా
తెలియకుంటే నీ జీవితం గుండు సున్నా!


కామెంట్‌లు