మాకిష్టం: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
గోరుముద్దలు తినిపించే
తీపి ముద్దులు కురిపించే
మా అమ్మంటేనే మాకిష్టం
మాకు లేదులే ఇక ఏ కష్టం !

చదువులు ఎన్నో చెప్పించు
అడిగినవన్నీ ఇక  ఇప్పించు
మా నాన్నంటేనే మాకిష్టం
మాకు లేదులే ఇక ఏ కష్టం !

 పలు నీతి కథలను చెప్పేటి
  పొడుపు కథలను విప్పేటి
 తాతయ్యంటే మరింత ఇష్టం
 మాకు లేదులే ఎలాంటి కష్టం !

చదరంగం ఆటను ఆడించే
పదబంధం పాటను పాడించే 
నాన్నమ్మ అంటేనే మా కిష్టం
మాకు లేదులే ఎలాంటి కష్టం !

తీయని తాయిలం ఇప్పించే
మోహిని హాయిని కలిగించే
మా మామయ్యంటే మాకిష్టం
మాకు లేదులే ఎలాంటి కష్టం !

పదవుల ధర్మం చెప్పేటి
చదువుల మర్మం విప్పేటి
మా గురువంటేనే  మాకిష్టం
మాకు లేదులే ఎలాంటి కష్టం !
.

కామెంట్‌లు