ఆపిల్ను కాశ్మీర్ లోనే దాచిపెట్టి వెళ్తున్నాను.
గులాబీని భూమిలో పాతిపెట్టి వెళ్తున్నాను.
రామలక్ష్మణులను -లవకుశులను
అడవిలోనే వదిలిపెట్టి వెళ్తున్నాను.
భీష్ముని కర్ణుని
యుద్ధభూమిలోనే వదిలిపెట్టి వెళ్తున్నాను.
ఈఫిల్ టవర్ ను-బిగ్ బెన్ ను
పోల్చి వెళ్తున్నాను.
మనసును మందిరాన్ని
ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాను.
కాశీని గంగను కలిపి వెళ్తున్నాను.
అగ్నిని నీరును నీకు అర్పించి వెళ్తున్నాను.
అయోధ్యను ద్వారకను
సముద్రంలో నిర్మించి వెళ్తున్నాను.
సీతను ఊర్మిళను ద్రౌపదిని
భూగర్భంలో దాచిపెట్టి వెళ్తున్నాను.
లైలా మజ్ను రజియా సుల్తానాలను
ప్రేమ సింహాసనం పై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి వెళ్తున్నాను.
సూర్యచంద్రులను
కిందికి దించి వెళ్తున్నాను.
దేవుని కుమారుడు యేసును
స్తుతిస్తూ వెళ్తున్నాను.
ఆకాశం భూమి కలిసే చోట
నిన్ను గుర్తించుకుంటూ వెళ్తున్నాను..!!?
పూణే లత ఇంట్లో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి