మన జాతిపితామహ బాపూజీ పుట్టింది
పోరు బందరు అను పురాతన గ్రామంలో
ఎదిగి పోరు సల్పుతూ తాను కాలు పెట్టింది
భారత స్వాతంత్ర సమర సంగ్రామంలో !
స్వతంత్రించి సమరభేరి మ్రోగించారు
స్వాతంత్ర సమరాన్ని తాను సాగించారు
ఆంగ్లేయుల పర ప్రభుత్వాన్ని ఎదిరించారు
వారి గుండెల్లో సింహ స్వప్నమై నిదురించారు !
స్వాతంత్రం సాధించి మనకు వారు అందించుటకు
అహరహం సమరం సాగించనుగా బాపూజీ
పలాయనమైన పరతంత్ర ఆంగ్ల ప్రభుతకు
స్వర తంత్రులు తెగేలా కలిగించే ఇబ్బంది జీ !
ఓ బాపూ మా బాపూ చూడు నీవు మా వైపూ
ఉండాలి మీరు మా ప్రక్కన రేపూ మాపూ
ఏది ఎక్కడ చురుకైన మీ చక్కని ఓ చూపు
గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల స్థితి గతుల వైపు !
దేశానికి పల్లెటూళ్ళే పట్టుకొమ్మలని అన్నావు
స్థిరంగా ఉండే మెట్టు దిమ్మెలై నిలవాలను కొన్నావు.
మస్తు మస్తుగా ఆలోచించి కలలెన్నో నీవు కన్నావు
ఆ కలలన్నీ కల్లలయ్యేనని వగచి చింతించావు !
పారిశుధ్యం పై దళితులకు అవగాహన కలిగించావు
బహుళ జన జాగృత బృందంలో వారి విలువను వెలిగించావు
సదా వరలా జీవించాలని మీరు వారిని దీవించారు
ఆర్భాటం లేకుండా యధావిధిగా ఉండాలని భావించారు !
ఆంగ్లేయుల గుండెల్లో మీరు డప్పులనే కొట్టినారు
జైల్లో ఒంటరిగా ఉండి చెప్పులనే ఇక కుట్టినారు.
లేకి పని పాకి పని అనకుండా మీరు చేసి చూపినారు
శ్రమ విలువను నిలువెత్తు శిఖరంపై నిలబెట్టినారు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి