హారతి అందుకో తెలుగు వెలుగు భారతి
మంగళ హారతి అందుకో మా బ్రహ్మసతి
దివ్యమైన ఈ హారతి భవ్యమైన మా హారతి
సదా వెలుగు హారతి ఈ మంగళ హారతి !
మంగళ హారతి అందుకో ముందుగా
సురులు భూసురులు మెచ్చుకునే విందుగా
మా హారతి అందుకో ఓ మా భారతి
మంగళ హారతి అందుకో ఓ సురసతి !
సుప్రభాతమందు మేం స్నానమాచరించి
మా నుదుటన సింధూరం తిలకం ధరించి
పసుపు కుంకుమలతో ముఖ ప్రక్షాళన గావించి
మా మనసులో నిన్ను మనసారా ధ్యానించి
మేము ఇచ్చేటి ఈ హారతి అందుకో భారతి!
మేం అందించే ఈ హారతి అందుకో భారతి
దివ్యమైన ఈ హారతి భవ్యమైన మా హారతి
ఈ మంగళహారతి మా మంగళప్రదమైన భారతి
అందుకొని మమ్ముల దీవించు బ్రహ్మసతి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి