మనుషులంతా తోలుబొమ్మలే: - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497


(జీవన ముఖచిత్రం)
=================
మనుషులంతా తోలుబొమ్మలే
విధి ఆడే వింతనాటకంలో
అందరూ పావులే 
కర్మకెవరైనా నిబద్ధులే
కర్మానుసారే మానవజన్మ

మనుషులంతా 
గాలిఊదిన తోలు తిత్తులే
ఎప్పుడైతే తోలుతిత్తి నుండి వాయువు అనంతవాయుల్లో కలుస్తుందో అప్పుడు తన ఉనికిని తాను కోల్పోయినట్లే 

బాల్యంలో ఏమి తెలియని 
అమాయకత్వం 
చదువు సంధ్యలు నేర్చిన తర్వాత 
విచక్షణతో 
ప్రత్యేక అభినివేశాలు

యవ్వనంలో తుంటరితనం
ఎవరిని లెక్క చేయని మొండి గుణం 
తనదే పైచేయి కావాలనే స్వార్థం
 
ఏదో సాధించాలనే తపనలు
కొన్నాళ్ళు 
అది సాధించలేక
ఓటములు

జీవన గమనంలో 
ఎత్తుపల్లాలు 
స్వీయానుభవాలు నేర్పిన గుణపాఠాలు 
తిరిగి చూసేసరికి 
మృత్యువుకబళించడం
తనది కాని లోకంలో ఒక మజిలీ పూర్తైన జీవనయానం 

జీవన్ముక్తి కల్గకముందే
పరమపదం 

జీవితంలో 
ఉత్థానపతనాలు
సంతోషాలు దుఃఖాలు
కలిమిలేములు
మానవ జీవన ముఖచిత్రం 

కామెంట్‌లు