మాయమైపోతున్నమనిషి: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
మానవ సంబంధాలన్నీ మనీసంబంధాలవుతున్నాయి
బంధాలు బంధుత్వాలు దూరమౌతున్నాయి
ఆర్థిక సంబంధాలే బలపడుతున్నాయి 

మంచిమానవత మృగ్యమైపోతున్నాయి
అత్తిపత్తి సంబంధాలే నిజమైనవని నమ్ముతున్నారు 
కూటి కోసం కోటిపాట్లుకొందరివి
కుతంత్రంతో దగా మోసం ఇంకొందరి(ది)వి

కడుపు నిండినోడు దొరతనం చూపెడుతున్నాడు
కడుపు కాలినోడు రెక్కలుముక్కలుచేసుకుంటున్నాడు
అవసరం ఉన్నప్పుడు భూస్థాయికి దిగజారినట్టుప్రవర్తిస్తున్నాడు
అవసరం తీరాక ముఖం చాటేస్తున్నాడు

ఇతరులపై జాలి చూపేవారు కరువై పోయారు
పాపపు కూడు తినేవాళ్ళు ఎక్కువైపోయారు
ఓ మనిషి..నువ్వుమనిషిగా మసలుకో
విశ్వాసాన్ని పెంచుకో
విశ్వ శ్రేయస్సును కాంక్షించు

కామెంట్‌లు